Saturday, October 18, 2025 07:10 PM
Saturday, October 18, 2025 07:10 PM
roots

జోగి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

ఏపీలో కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్థన్ రావు బయటపెట్టిన వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టారు. నకిలీ మద్యం వైసీపీ ప్రభుత్వంలోనే తయారీ ప్రారంభమైందని వెల్లడించిన జనార్థన్ రావు.. దీని వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నట్లు ఆరోపించారు. జోగి రమేష్ అండతోనే కల్తీ మద్యం తయారు చేశామని.. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఆపేశామన్నారు.

Also Read : లిమిట్స్ లో ఉండండి.. పాక్ కు ఆఫ్ఘన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసులో ఏ1 జనార్థన్‌ రావును పోలీసులు గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. జనార్థన్ రావు పేరు బయటకు వచ్చింది. దీంతో తాను ఆఫ్రికాలో ఉన్నానని.. తిరిగి వచ్చిన వెంటనే అన్ని వివరాలు వెల్లడిస్తా అంటూ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు మరో వీడియో రావడం.. అందులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది.

కేవలం కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికే నకిలీ మద్యం తయారు చేయాలని జోగి రమేష్ తనకు చెప్పినట్లు జనార్థన్ రావు ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ తనకు స్వయంగా ఫోన్ చేసి.. నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారు. తొలుత ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నప్పటికీ.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అయితే సీఎం చంద్రబాబు సొంత కాబట్టి.. ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు వస్తుందని జోగి సూచించినట్లు వెల్లడించారు. లిక్కర్ తయారీ యంత్రాలు కూడా జోగి రమేష్ సమకూర్చారన్న జనార్థన్ రావు.. సరైన సమయం చూసి దీనిని బయటపెడతామన్నారని.. అప్పుడు ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డపేరు వస్తుందన్నారని జనార్థన్ తెలిపారు. తనను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు సహాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని.. తనను ఆఫ్రికా పంపింది కూడా జోగి రమేష్ అని జనార్థన్ తెలిపారు.

Also Read : బాబు పై నా అభిప్రాయం ఏంటంటే..!

కల్తీ మద్యం తయారీ గురించి తన మనుషుల ద్వారా జోగి రమేష్ అధికారులకు తెలిసేలా చేశారన్నారు జనార్థన్. టీడీపీ నేతలను చంద్రబాబు సస్పెండ్ చేయడంతో.. ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ జరిగేలా జోగి ప్లాన్ చేశారన్నారు. సాకి మీడియాను ముందే అక్కడ ఉంచారన్న జనార్థన్ రావు.. అనుకున్నట్లు జరిగిందని.. ఆఫ్రికా నుంచి రావాల్సిన అవసరం లేదని తనతో జోగి చెప్పారన్నారు. అయితే తన తమ్ముడిని కూడా జోగి రమేష్ ఇరికించడంతో పాటు తనను పూర్తిగా మోసం చేశారని వీడియోలో తెలిపారు. జోగి రమేష్‌తో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని.. జోగి రమేష్ గురించి బయటకు వచ్చి నిజం చెబుతున్నట్లు జనార్థన్ రావు వీడియోలోతెలిపారు.

నిన్నటి వరకు కల్తీ మద్యంపై కూటమి సర్కార్‌ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. జనార్థన్ వీడియో తర్వాత కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు. అటు టీడీపీ నేతల కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా జోగిపై ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం చర్యలు తీసుకోలేదని.. అందుకే ప్రభుత్వంపై ఇంత పెద్ద అపవాదు వేసేందుకు కూడా జోగి రమేశ్ తెగించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్