Tuesday, October 28, 2025 06:56 AM
Tuesday, October 28, 2025 06:56 AM
roots

వైసీపీకి మంగళం పాడిన వెంకటరమణ

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జగన్ ను ఎంతో నమ్మి ఆ పార్టీలో జాయిన్ అయిన కొందరు నాయకులు ఇప్పుడు దండం పెట్టి బయటకు వచ్చేస్తున్నారు. టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన నేతలు ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ కీలక నాయకులుగా చెప్పుకునే వారు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు.

Also read : వాళ్లిద్దరి భేటీ… మర్మమేంటి…?

తాజాగా కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఏలూరు జిల్లా నుంచి మాజీ మంత్రి ఆళ్ళ నానీ గుడ్ బై చెప్పగా… తాజాగా జయమంగళం వెంకటరమణ దండం పెట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ ఆ పదవికి రాజీనామా చేశారు. వైసిపి పార్టీకి కూడా జయమంగళ రాజీనామా చేశారు. అధికార పార్టీలో ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకు ఏమి సేవ చేయలేకపోయానని జయమంగళ ఆవేదన వ్యక్తం చేసారు.

Also read : ఏజెన్సీ వాసుల కోసం బాబు సర్కార్ సూపర్ ప్లాన్…!

కనీసం పోలీసులకి ఫోన్ చేయాలన్న స్వతంత్రం లేదని జయ మంగళ వాపోయారు. పదవి అయితే ఇచ్చారు గాని పవర్ ఇవ్వలేదని జయ మంగళ తన ఆవేదన వెళ్లగక్కారు. 23 సంవత్సరాలు టిడిపిలో ఉండి కొల్లేరు ప్రజల కోసం వైసీపీలోకి వచ్చాను, వైసీపీలో కూడా ఏమీ చేయలేకపోయానన్నారు. ఏదైనా సమస్య కోసం వైసీపీ ప్రభుత్వాని కోరితే సజ్జలతో మాట్లాడు, ధనుంజయ గారితో మాట్లాడు అనడమే తప్ప ఏ పని జరగలేదన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా కొల్లేరు ప్రజలకి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేసారు. ఏ పార్టీలోకి వెళ్ళేది నా ప్రజలతో మా నాయకులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణ తెలుపుతానన్నారు. సమస్యల గురించి మాట్లాడదామని వెళితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్