సాధారణంగా ఆస్ట్రేలియా తో క్రికెట్ ఆడాలంటే మానసికంగా చాలా బలంగా ఉండాలి. ఆస్ట్రేలియా ఆటగాళ్ల మాటలు దాడి అలాగే వాళ్ళ బౌలింగ్ విధానం అన్నీ కూడా కాస్త భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆట తీరుపై ఇప్పుడు క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రధానంగా టీమిండియా ఆటగాడు రిషబ్ పంతును టార్గెట్ చేసిన విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంత్ బాగా ఆడే అవకాశం ఉండటంతో అతని ఎలాగైనా గాయపరచాలనే ఉద్దేశంతో కెప్టెన్ కమీన్స్ అలాగే స్కాట్ బోలాండ్ సహా ఇతర బౌలర్లు కూడా పంతను టార్గెట్ చేశారు.
Also Read : చిల్లర ప్రవర్తన.. మరోసారి ప్రూవ్ చేసుకున్న ఆసిస్
అతని పరుగులు చేయకుండా కట్టడి చేసేందుకు పదేపదే విసిరిన బంతులు అలాగే వికెట్ల వద్ద అతన్ని చేసిన స్లెడ్జింగ్ అన్ని కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాదాపు 14 సార్లు పంత్ ను గాయపరిచే విధంగానే బంతులు వేశారు. ముఖ్యంగా చేతికి తగిలిన గాయం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందరూ పదేపదే అతని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. గిల్ ను టార్గెట్ గా చేసుకుని వెకిలి నవ్వులు, ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండలేవు బేబి బాయ్ అంటూ కామెంట్స్ చేసారు.
Also Read : ఎస్పీని వేధిస్తున్నారా..? రేవంత్ సర్కార్ పై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు…?
నాలుగో టెస్ట్ లో కూడా ఇలాగే భారత ఆటగాళ్లు టార్గెట్ చేసి స్లెడ్జింగ్ కు పాల్పడింది ఆస్ట్రేలియా. వికెట్లు పడకపోవడంతో మానసికంగా దెబ్బతీయటానికి ఆస్ట్రేలియా రెడీ అయింది. ఈ టెస్ట్ కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదల లో ఉన్న ఆస్ట్రేలియా భారత ఆటగాళ్లను మానసికంగా టార్గెట్ చేయడం పట్ల మాజీ క్రికెటర్ లు మండిపడుతున్నారు. ఇక టీమిండియా ఆల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాడు కొన్స్టాస్ బూమ్రా టార్గెట్ గా స్లెడ్జింగ్ చేశాడు. దీనికి బూమ్ర కూడా అదే రేంజ్ లో బదులిచ్చాడు. మొదటి రోజు చివరి బంతికి ఖవజా వికెట్ తీసి రివేంజ్ తీర్చుకున్నాడు.