Friday, September 12, 2025 10:37 PM
Friday, September 12, 2025 10:37 PM
roots

సేనాలో ది బెస్ట్.. బూమ్రా సరికొత్త రికార్డులు

దేశం ఏదైనా.. జట్టు ఎలాంటిది అయినా.. పిచ్ ఎలా ఉన్నా.. పరిస్థితి అనుకూలంగా లేకపోయినా.. టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా మాత్రం తనపై పెట్టుకున్న నమ్మకాలను ఎక్కడా వమ్ము చేయడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో బౌలింగ్ విభాగంలో జట్టుకు వెన్నుముఖగా నిలిచినా బూమ్రా.. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో సైతం అదే రేంజ్ లో ప్రదర్శన చేస్తున్నాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అతని బౌలింగ్ ధాటికి ఇంగ్లీష్ బ్యాటింగ్ లైనప్ కుదేలు అయిపొయింది. క్యాచ్ లు సరిగా పట్టి ఉంటే ఇంగ్లాండ్ ను 300 పరుగుల లోపే బూమ్రా కట్టడి చేసేవాడు.

Also Read : ఎవరికి ఎవరు కనిపించటం లేదు.. జస్ట్ ఆస్కింగ్..!

ఇక ఈ మ్యాచ్ లో అతని ప్రదర్శనతో మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 14వ సారి కాగా విదేశాల్లో 12వ సారి. సెనాలో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. 3వ రోజు భారత్ తరఫున బుమ్రా ఒంటరి పోరాటం చేశాడు, 24.4 ఓవర్లలో 83 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ కావడంతో బూమ్రాదే కీలక పాత్ర.

Also Read : క్యాచ్ కాదు మ్యాచ్ వదిలేసాడు.. జైస్వాల్ ముంచేసాడా..?

విదేశాల్లో ఎక్కువ 5 వికెట్లు తీసిన జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా – 12, కపిల్ దేవ్ – 12 మొదటి స్థానంలో ఉండగా.. అనిల్ కుంబ్లే – 10 తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇషాంత్ శర్మ – 9, ఆర్ అశ్విన్ – 8 సార్లు 5 వికెట్లు తీసారు. ఇక ఆసియా విషయానికి వస్తే.. జస్ప్రీత్ బుమ్రా – 31 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తీస్తే.. వసీం అక్రమ్ – 32 మ్యాచ్‌ల్లో 146 వికెట్లు తీసాడు. అనిల్ కుంబ్లే – 35 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ – 40 మ్యాచ్‌ల్లో 127, జహీర్ ఖాన్ – 30 మ్యాచ్‌ల్లో 119 వికెట్లు తీసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్