Thursday, February 5, 2026 01:34 AM
Thursday, February 5, 2026 01:34 AM

రిటైర్మెంట్ ఆలోచనలో స్టార్ బౌలర్

టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా ఫిట్నెస్ పై అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. బూమ్రా.. ఫిట్నెస్ లేకపోవడంతో కీలక మ్యాచ్ లకు దూరం అవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనతో పోలిస్తే ఇంగ్లాండ్ లో మెరుగ్గా రాణించలేదు అనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో టెస్ట్ కు కూడా అతను దూరమయ్యాడు. కీలకమైన 5వ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు బూమ్రా. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇతర ఆటగాళ్ళతో పోలిస్తే అతను తక్కువ మ్యాచ్ లు ఆడుతున్నాడు.

Also Read : రెండు నాలుకల ఇంగ్లాండ్.. అడ్డంగా దొరికిందా..?

సిరాజ్.. 5 టెస్టులకు అందుబాటులో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో కూడా 5 టెస్టులు ఆడాడు. అంతకు ముందు న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ కు కూడా అందుబాటులోకి వచ్చాడు. సిరాజ్ తో పోలిస్తే బూమ్రా వర్క్ లోడ్ తక్కువే. అయితే అతని బౌలింగ్ యాక్షన్ మైనస్ అనేది ఇప్పుడు అభిమానుల ఆవేదన. బూమ్రా ఇంగ్లాండ్ టూర్ లో 10 వికెట్లు మాత్రమే తీసాడు. అందులో లోయర్ ఆర్డర్ వికెట్లు ఎక్కువ. టాప్ ఆర్డర్ వికెట్లు తీసినప్పుడు అతని యావరేజ్ 40.

Also Read : ఐపీఎస్ సంజయ్‌కి సుప్రీంకోర్టులో భారీ షాక్

లోయర్ ఆర్డర్ వికెట్లు చూస్తే 7 మాత్రమె. ఆస్ట్రేలియాలో సక్సెస్ అయిన బూమ్రా ఇంగ్లాండ్ లో సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలతో అతను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. వన్డేలు, టి20 లు మాత్రమే ఆడే అవకాశం ఉందని భారత క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జట్టు యాజమాన్యంతో కూడా అతను మాట్లాడినట్టు తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్ లో మరొకరికి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారనే సూచన కూడా బూమ్రాకు ఎదురైనట్లు సమాచారం. మరి ఏం చేస్తాడో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్