Friday, September 12, 2025 10:50 PM
Friday, September 12, 2025 10:50 PM
roots

మొన్న రోహిత్.. నిన్న కోహ్లీ.. నేడు బూమ్రా.. ఫ్యాన్స్ కు షాక్

ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియా ఎంపిక ఇప్పుడు సవాల్ గా మారింది. సీనియర్లు లేకుండా తొలిసారి ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ వెళ్తోంది. గతంలో సీనియర్ ఆటగాళ్లు ఒకరిద్దరూ జట్టులో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో లేకుండా ఇంగ్లాండ్ పయనం అవుతున్నారు. కెప్టెన్ గా ఎవరికి అవకాశం కల్పిస్తారు.. వైస్ కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు చేపడతారు.. అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Also Read : అతడికి ఛాన్స్ పక్కా.. గంభీర్ డిసైడ్ అయ్యాడా..?

ఇక బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటుంది టీమిండియా యాజమాన్యం. ఈ టైంలో సీనియర్ బౌలర్ బూమ్రా.. ఊహించని షాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా ఐదు టెస్టులు ఆడిన ఈ బౌలర్.. చివరి మ్యాచ్లో గాయపడ్డాడు. ఆ తర్వాత బౌలింగ్ కు కొన్నాళ్లు దూరమయ్యాడు. ఇతర బౌలర్లతో పోలిస్తే బూమ్రా ఫిట్నెస్ తక్కువ. వేగంగా బంతులు విసిరిన సరే.. నడుం నొప్పి అతన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. గతంలో కూడా గాయాలు పలుమార్లు అతడిని వెంటాడిన సందర్భాలు ఉన్నాయి.

Also Read : రిషబ్ పంత్ కెప్టెన్సీ ఊస్ట్..! లక్నో యాజమాన్యం నిర్ణయం..?

అందుకే రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ లో.. ఐదు టెస్టులు ఆడలేనని బీసీసీఐ పెద్దలకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై జాతీయ మీడియా ఓ కథనం కూడా రాసింది. దీనికి బోర్డు పెద్దలు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. బూమ్రా గాయాలను దృష్టిలో పెట్టుకున్న బోర్డు పెద్దలు అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం టి20లో.. సమర్థవంతంగా బౌలింగ్ చేస్తున్న తక్కువ ఓవర్లే కాబట్టి ఇబ్బంది లేదు. టెస్ట్ లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని.. తాను ఐదు టెస్టులు ఆడలేనని చెప్పినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్