రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. జూన్ 1 నుంచి సినిమా ధియేటర్లను మూసివేయాలని యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏపీలో రాజకీయ అలజడి కూడా మొదలైంది. సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ జూన్ 1 నుంచి సినిమా హాల్ లను మూసివేయాలని నిర్ణయించారు. దీనిపై క్రమంగా సోషల్ మీడియాలో పలు ఆసక్తికర చర్చలు కూడా కనబడుతున్నాయి.
Also Read : కవిత కోపానికి కారణం ఆయనేనా..?
పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా త్వరలో విడుదల కానుంది. జూన్ 12న ఈ సినిమా విడుదల అవుతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సమయంలో దియేటర్లను మూసివేయాలని యాజమాన్యాలు ప్రకటించడం వెనక కుట్ర ఉంది అనేది ఇప్పుడు జనసేన పార్టీ చేస్తున్న ఆరోపణ. తాజాగా దీనిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా సమయంలోనే ఎందుకు ఈ రచ్చ మొదలైంది అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మరి కొంతమంది జనసేన నేతలు ఒక అడుగు ముందుకు వేసి కావాలనే కొంతమంది కుట్రలు చేస్తున్నారని విమర్శించడం మొదలుపెట్టారు.
Also Read : బెజవాడలో బంగ్లాదేశ్ అలజడి.. ఎవరు వీరంతా..?
అయితే దీని వెనుక తెలంగాణ ప్రభుత్వం ఉందని కొంతమంది వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కావాలనే అల్లు అరవింద్.. దిల్ రాజ్ తో కలిసి కుట్ర చేస్తున్నారని.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ డ్రామా ఆడిస్తుందంటూ జనసేన నేతలు విమర్శించడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ కావాలనే ఈ డ్రామా మొదలు పెట్టించాడని.. వెన్నుపోటు పొడవడం అల్లు అర్జున్ కు కొత్త కాదంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ నిర్ణయం పై ఏపీ ప్రభుత్వం విచారణకు కూడా సిద్ధమైంది. సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్న సరే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విచారణకు ఆదేశించారు. మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలి.




