Monday, October 27, 2025 10:07 PM
Monday, October 27, 2025 10:07 PM
roots

పవన్ సినిమా హీరో కాదు మినిస్టర్.. ప్రమోషన్లో ఫెయిల్ అవుతోన్న జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రమోట్ చేసుకునే విషయంలో ఆయన అభిమానులు ఫెయిల్ అవుతున్నారా..? పవన్ కళ్యాణ్ పదవిపై కంటే ఆయన సినిమాలపైనే ఎక్కువగా ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. పొలిటికల్ ఇమేజ్ పెంచుకునేందుకు అప్పటినుంచి పవన్ కళ్యాణ్ తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. ప్రజల్లోకి అప్పుడప్పుడు వెళుతూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు.

Also Read : పులివెందుల టీడీపీదే.. వైసీపీకి దక్కని డిపాజిట్ 

అయితే వీటిని ప్రమోట్ చేసుకునే విషయంలో మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలు విఫలమవుతున్నారు అనే ఆవేదన జనసేన పార్టీ అధిష్టానాన్ని వెంటాడుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్, తర్వాత రాబోయే ఓ జి.. అనే సినిమా పైనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇప్పుడు ఓ జి సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. కానీ పవన్ కళ్యాణ్ పదవిపై గాని ఆయన రాజకీయ ప్రయాణంపై గాని ఎక్కడ దృష్టి సారించడం లేదు.

జనసేన పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు అనే ఆరోపణలు వినబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడిన రోజు మాత్రమే ఎక్కువగా ఆయన వీడియోలను వైరల్ చేయడం జరుగుతుంది. మిగిలిన సందర్భాల్లో ఎక్కువగా సైలెంట్ గా ఉంటున్నారు. పదవుల్లో ఉన్న నాయకులు సైతం మీడియాలో కూడా కనబడటం లేదు. నియోజక వర్గాల్లో సైతం ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదు అనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ ను సినిమా హీరోగా మాత్రమే ఆయన అభిమానులు చూడటం ఇబ్బంది కలిగించే అంశం.

Also Read : మోడీకి వెంకయ్యే పెద్ద దిక్కయ్యారా..?

గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కనీసం వాటిని కూడా ప్రమోట్ చేసుకునే విషయంలో పవన్ ఫ్యాన్స్ ఫెయిలయ్యారు. ఇటీవల రేషన్ కార్డుల విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆ శాఖ జనసేన పార్టీదే కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అంశం కూడా కాబట్టి దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి భవిష్యత్తులో అయినా పవన్ ఫ్యాన్స్ ఆయన పొలిటికల్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నాలు చేస్తారా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్