Friday, August 29, 2025 08:13 PM
Friday, August 29, 2025 08:13 PM
roots

ఉత్తరాంధ్రలో వైసీపీకి జనసేన దెబ్బ..?

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2024 లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తన బలం పెంచుకునేందుకు వైసీపీ నాయకులకు స్వాగతం పలుకుతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ గేట్లు మూసివేయడంతో కేసులకు భయపడి కొందరు నాయకులు జనసేన తీర్ధం కూడా పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కనీసం 40 నియోజకవర్గాల్లో పోటీ చేసే దిశగా జనసేన ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Also Read : రెండు పెన్షన్లు.. చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్

ఇదిలా ఉంచితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులకు స్వాగతం పలికేందుకు జనసేన సిద్దంగా ఉన్నట్టు సమాచారం. వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణ జనసేన తీర్ధం పుచ్చుకునే సంకేతాలు కనపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పార్టీ నాయకత్వంతో కూడా వారు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.

Also Read : ట్రంప్ దెబ్బకు తమిళనాడులో ఆ నగరం ఖాళీ..!

ఉత్తరాంధ్రలో విశాఖతో పాటుగా మిగిలిన రెండు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో పలువురు నాయకులు ఆ పార్టీ తీర్ధం పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్న నాయకులు కూడా పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మొన్నామధ్య వైసీపీ నుంచి పది మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చేరికలు ఉండే అవకాశం సైతం కనపడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్