ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ రాజకీయం ఎలా ఉంటుందో ఊహించడం కొన్ని సందర్భాల్లో కష్టంగానే ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలను కొంతమంది తక్కువగా తీసుకున్నా.. ఆయన మాత్రం చేసేది చేస్తూనే ఉంటారు. తన పరిస్థితి ఎలా ఉన్నా సరే దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి జగన్ అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సానుభూతి రాజకీయాలను జగన్ మొదలు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీకి రాజీనామా చేయించే ఆలోచనలో జగన్ ఉన్నారు.
Also Read : బాబు సీనియర్… ఇక నీ సేవలు చాలు..!
ఇప్పటికే దీనిపై మీడియాకు లీకులు కూడా ఇచ్చారు జగన్. వారిని శాసనసభ సమావేశాలకు పంపే విధంగా జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనను మరింత బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారని, తన ఎమ్మెల్యేలను కూడా లాక్కుంటున్నారని, ప్రజల్లోకి కొత్త వ్యూహంతో అడుగుపెట్టేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు జగన్ సలహాలు, సూచనలు కూడా ఇచ్చారట. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన సరే జగన్ కు పెద్దగా సానుభూతి రాలేదు.
Also Read : అరెస్ట్ బెదిరింపులు.. చివరకు బెదిరింపులతో అరెస్ట్
అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలతో పార్టీకి రాజీనామా చేయించి, వారిని శాసన సభా సమావేశాలకు పంపి.. టిడిపి నేతలకు దగ్గర చేయాలని జగన్ ఓ ప్రణాళిక ప్రకారం వెళుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపి నేతలతో టచ్ లోకి కూడా వెళ్లారు. ఇక దీని ద్వారా తనకొచ్చిన 11 మంది ఎమ్మెల్యేలలో అయిదుగురు ఎమ్మెల్యేలను లాక్కున్నారని… 2019 ముందు కూడా ఇలాగే జరిగిందని జగన్ చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : బూమ్రా లేడు.. భారం మొత్తం ఆ ఇద్దరిపైనే…!
అప్పట్లో టిడిపిలోకి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని జగన్ గట్టిగానే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు తన పార్టీ నాయకులను సొంతగా తానే రాజీనామా చేయించి సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక ఇప్పటికే అగ్నిప్రమాదం ద్వారా జగన్ సానుభూతి ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ కొత్త వ్యూహం అయినా కలిసి వస్తుందో లేదో చూడాలి.