ఏపీలో సున్నిత ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు వైసిపి ప్రయత్నం చేస్తుందా.. అంటే అవుననే సమాధానం వినపడుతోంది. రాప్తాడులో జగన్ చేసిన హడావుడి చూసిన తర్వాత అనేక అనుమానాలు కలుగుతున్న పరిస్థితి. గతంలో కూడా అనంతపురం జిల్లాలో అలజడి సృష్టించేందుకు జగన్ అండ్ గ్యాంగ్ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే చిన్న చిన్న సంఘటనలను కూడా పెద్దగా చేసి చూపించే ప్రయత్నం అప్పట్లో జరిగింది. ఇక ఇప్పుడు కూడా అదే రాజకీయం చేస్తున్నారు జగన్.
Also Read : జగన్ పై అనిత సంచలన కామెంట్స్.. వాట్సాప్ మెసేజ్ లపై కీలక వ్యాఖ్యలు
కొంతమంది వివాదాస్పద నేతలు, సున్నిత నియోజకవర్గాల విషయంలో జగన్ దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇటీవల చింతమనేని ప్రభాకర్ విషయంలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కావాలనే ఆయనను రెచ్చగొట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక చింతమనేని కూడా దూకుడుగా మాట్లాడటంతో వైసిపి ఆ వీడియోతో పండగ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు రాప్తాడులో జరిగిన ఓ ఘటన విషయంలో కూడా జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు.
Also Read : క్యాబినెట్ విస్తరణ.. అది జరిగినప్పుడు చూద్దాం..!
ఆయన రాప్తాడు వెళ్లి పరామర్శ కూడా చేశారు. దీనితో వివాదాస్పద నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుని రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసిపి వ్యూహాలు సిద్ధం చేస్తుందని, అందుకే జగన్ రంగంలోకి దిగారు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి టిడిపిలో గాని కూటమిలో ఉన్న నాయకులు గాని కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని.. సోషల్ మీడియాలో పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగిన పరిణామాలలో దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని సూచిస్తున్నారు.
Also Read : బీ కేర్ ఫుల్.. జగన్‌కు మాస్ వార్నింగ్..!
లేదంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయని, అలాగే మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండకపోతే వైసిపి వాటిని అన్ని విధాలుగా వాడుకునేందుకు సిద్ధమవుతుందని.. హెచ్చరిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ సహా పలువురు దూకుడుగా ఉండే ఎమ్మెల్యేలు.. తమ స్వభావం మార్చుకోకపోతే అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా చింతమనేని వంటి వారిని బూచిగా చూపించి టిడిపి పై వైసీపీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున చేసింది.