Friday, September 12, 2025 11:12 PM
Friday, September 12, 2025 11:12 PM
roots

పాత ప్లాన్ అమలు చేస్తున్న జగన్… వర్కవుట్ అవుతుందా…?

ఘోర పరాజయం పాలైన జగన్… తిరిగి గాడిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇస్తామని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చెప్పిన జగన్… కానీ నెల రోజులు కూడా కాక ముందే ప్రతిపక్ష హోదా కావాలంటూ ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయని… దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ… పరామర్శలు చేయడం ప్రారంభించారు. అలా పరామర్శ సమయంలో కూడా సూపర్ సిక్స్ పధకాలు అమలవుతున్నాయా… అంటూ ప్రశ్నించి విమర్శల పాలయ్యారు.

అయితే తాజాగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు తనకు కలిసి వచ్చిన ఫార్ములానే మరోసారి వాడేందుకు సిద్ధమయ్యారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసినప్పటికీ… ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. దీంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యమైంది. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏమైందంటూ చంద్రబాబును జగన్ పదేపదే నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, పారిశ్రామిక అభివృద్ధికి చేయూత, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం… ఇలా కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్న జగన్… దీనికి చంద్రబాబు జవాబు చెప్పాలని ఒత్తిడి చేశాడు.

Also Read : జగన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టిన షర్మిల…!

టీడీపీపై ఒత్తిడి పెరగడంతో… చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో చేతులు కలిపిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడారు. దీంతో ఇప్పుడు ఇలాంటి వ్యూహాన్నే జగన్ మరోసారి నమ్ముకున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జగన్ ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది అంటూ ఎక్స్ వేదికగా అర్థరాత్రి పూట సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇందులో చంద్రబాబుకు ఆరు ప్రశ్నలు వేశారు కూడా. పోలవరం ఎత్తును కేంద్రం తగ్గిస్తుంటే… చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

దీని వల్ల ప్రాజెక్టు లక్ష్యాలకే దెబ్బ తగులుతుంటే.. చంద్రబాబు నోరు మెదపడం లేదంటూ నిలదీశారు. ఎన్టీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి… కేంద్ర మంత్రులుగా టీడీపీ ఎంపీలు ఉన్నా కూడా ఎందుకు దీనిపై అభ్యంతరం చెప్పటం లేదదని జగన్ ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను నట్టేట ముంచేస్తారని మరోసారి రుజువైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే జగన్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ధీటుగా బదులిచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి జగన్ సర్కార్ 2022లో రాసిన లేఖను బయటపెట్టారు. అందులో ఎత్తును తగ్గించాలని జగన్ స్వయంగా సంతకం చేసి మరీ ప్రధాని మోదీకి రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గలేదని మరోసారి గుర్తు చేశారు. కావాలంటే వైసీపీ నేతలు వచ్చిన కొలతలు వేసుకోవచ్చు అంటూ చురకలు అంటించారు. రాష్ట్రానికి జలద్రోహం చేసింది జగన్ అని… కృష్ణా మిగులు జలాలు కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు లేఖ రాసి ద్రోహం చేసింది జగన్ ఆంటూ ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు ఫేజ్‌లుగా విభజించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. అబద్ధాలు మాని…. ముందు కుటుంబ కలహాలను చక్కబెట్టుకో అంటూ మంత్రి నిమ్మల పోస్ట్ చేశారు. దీంతో జగన్ తన పాత ఫార్ములా వర్కవుట్ కాలేదనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్