Friday, February 27, 2026 11:26 PM
Friday, February 27, 2026 11:26 PM

అన్న వాకింగ్ అంటే.. మామూలుగా ఉండదు మరి..!

“మరో ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది.” అంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో అసలు జగన్ పాదయాత్ర ఎలా ఉంటుంది.. ఏ ఊరు నుంచి ప్రారంభిస్తారు.. ఎన్ని రోజులు పాదయాత్ర చేస్తారు.. ఎప్పటి వరకు పాదయాత్ర ఉంటుందనే చర్చ అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు వైసీపీ నేతల్లో కూడా బాగానే వినిపిస్తోంది. మరోవైపు పాదయాత్ర పేరు, రూట్ మ్యాప్, ఏర్పాట్లపై ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే పాదయాత్ర‌ కవరేజ్ విషయంలో కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : టార్గెట్ జనసేనాని అంటున్న బొలిశెట్టి..!

జగన్ పాదయాత్ర అంటే.. అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ప్రజా సంకల్ప యాత్ర. ప్రతిపక్ష నేత హోదాలో 2017 నవంబర్ 6వ తేదీన పాదయాత్ర ప్రారంభించిన జగన్.. 341 రోజుల పాటు 2019 జనవరి 9 వరకు మొత్తం 3,648 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ పాదయాత్ర ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. రావాలి జగన్.. కావాలి జగన్.., నేను ఉన్నాను.. నేను విన్నాను.. అనే నినాదాలతో చేసిన ప్రచారంలో ప్రజలపై బాగానే ప్రభావం చూపించింది. అలాగే మీ రాజన్న బిడ్డ, మీ బిడ్డకు ఒక్క అవకాశం అంటూ జగన్ చేసి వేడుకోలు కూడా ఏపీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను వైసీపీకి దగ్గర చేసింది. అందుకే ఆ ఎన్నికలో వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయిందనేది వేరే విషయం. ఇక నాడు జగన్ సాగించిన పాదయాత్ర వారంలో 5 రోజులు మాత్రమే. ప్రతి శుక్రవారం తప్పని సరిగా కోర్టు వాయిదాలకు హాజరయ్యారు. అందుకోసం గురువారం మధ్యాహ్నమే యాత్ర ముగించి హైదరాబాద్ చేరుకున్నారు. మళ్లీ శనివారం మధ్యాహ్నం యాత్ర ప్రారంభించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

తాజాగా వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే.. మళ్లీ పాదయాత్ర చేస్తేనే బెటర్ అని కొందరు పార్టీ నేతలు ఇచ్చిన సలహా మేరకు జగన్ సరే అన్నారు. వచ్చే ఏడాది అంటే.. 2027 జూన్ లేదా జులై నెల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు పార్టీ పెద్దలకు జగన్ స్పష్టం చేశారు. ఈ యాత్ర 2029 జనవరి నెల వరకు కొనసాగాలని.. ఈ యాత్రలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్దం చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే ప్రతి రోజు 20 కిలోమీటర్ల దూరం మాత్రమే యాత్ర ఉండాలని.. ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉదయం 10 కిలోమీటర్లు, సాయంత్రం 10 కిలోమీటర్లు నడుస్తారట. అలాగే తాను బస చేసేందుకు ప్రత్యేక క్యారవ్యాన్‌లు సిద్ధం చేయాలని.. అలాగే సమావేశ మందిరాలు, ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు సిద్దం చేయాలని సూచించినట్లు పార్టీ నేతలు తెలిపారు.

Also Read : బ్రేకింగ్: లిక్కర్ కేసులో కవిత సేఫ్..!

తాను పదేళ్ల క్రితం చేసిన పాదయాత్ర గురించి ప్రస్తావించిన జగన్.. అప్పటికీ ఇప్పటికీ వయసు పెరిగింది కదా.. అని చెప్పారట. అందుకే ప్రస్తుత పాదయాత్రలో మార్పులు ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. పాదయాత్ర తన అనుకూల మీడియాలో బాగా కవరేజ్‌ రావాలని.. ఆ బాధ్యతలను ఒకరికి ఇద్దరు పర్యవేక్షించాలని జగన్ సూచించినట్లు సమాచారం. పాదయాత్రకు సోషల్ మీడియాలో బాగా ప్రచారం రావాలని.. అది ఎలా చేస్తారో తనకు ముందే చెప్పాలన్నారట. లోకేష్ యువగళం పాదయాత్ర అర్థరాత్రి పూట కూడా సాగిందని కొందరు నేతలు చెప్పిన మాటలకు.. మనకు అవసరమా.. అని జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

మొత్తం 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగాలని.. ఒక్కో నియోజకవర్గంలో తప్పనిసరిగా 10 రోజులు ఉండాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో ఎవరు ఎలా వ్యవహరించాలనే విషయంపై కూడా తనకు ముందుగానే చెప్పాలన్నారు. జన సమీకరణ, సభల ఏర్పాట్లు, మీడియా పబ్లిసిటీ.. పై ప్రత్యేక సూచనలు చేసినట్లు సమాచారం. యాత్రకు ఎంత ఖర్చువతుందనే లెక్కలు తనకు ముందుగానే చెప్పాలని.. ఆయా నియోజకవర్గాల నేతలకు కూడా ఏర్పాట్లపై ముందుగానే స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. జగన్‌ మాటలపై పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ లా పాదయాత్ర ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్...

గత నాలుగేళ్ల నుంచి సంచలనంగా మారిన...

పయ్యావుల వర్సెస్ మండలి...

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజకీయం హాట్...

బ్రేకింగ్: లిక్కర్ కేసులో...

నాలుగేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం...

నా భర్తను పరిచయం...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల...

పెద్దల సభ కు...

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ...

టార్గెట్ జనసేనాని అంటున్న...

ఏపీలో రెండు వరుస ఘటనలు ప్రభుత్వాన్ని...

పోల్స్