Saturday, September 13, 2025 05:06 AM
Saturday, September 13, 2025 05:06 AM
roots

చంద్రబాబు దెబ్బతో ఆత్మరక్షణలో జగన్

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. రాజకీయంగా ఇది పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిఎం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అలాగే తెలుగుదేశం నేతలతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేసిన కామెంట్స్ పెద్ద సంచలనం అయ్యాయనే చెప్పాలి. ఇక దీని విషయంలో ప్రభుత్వం ఒకరకంగా ఆత్మరక్షణలో పడింది అనే మాట వినపడుతుంది. దీనితోనే చంద్రబాబు అలాగే లోకేష్ మీద కేసులు పెట్టించారు అని అంటున్నారు.

అయితే ఇది గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపించింది అనే కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. దీన్ని ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేయడం పట్ల కాస్త దుమారమే రేగింది. ఇదే అమలు పూర్తి స్థాయిలో జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపించే అవకాశం ఉందనే మాట ప్రభుత్వ పెద్దల వరకు చేరింది. రూరల్ ప్రాంతాల్లో దీనిపై ఇప్పటికే ప్రజల్లో భయాలు మొదలయ్యాయని, పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఉండటం కూడా ఈ భయాలకు కారణం అయిందని అంటున్నారు. ఇక ప్రభుత్వ మాజీ ఐఏఎస్ అధికారి కూడా తానూ దీని బాధితుడిని అని ట్వీట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది.

ఇక భూమి పత్రాల జిరాక్స్ పేపర్ లను తన వద్ద ప్రభుత్వం ఉంచుకునే అవకాశం ఉందని అనడంతో ప్రజల్లో మరింత భయం మొదలయింది. ఇది రూరల్ ప్రాంతాలల్లో వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు తెచ్చింది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ ఈ యాక్ట్ విషయంలో గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయడం, అది సఫలం కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. పెన్షన్ ల విషయంలో తన మీద తప్పుడు ప్రచారం చేయడంతో చంద్రబాబు గేరు మార్చి ఈ విషయం మీద బలంగా ఫోకస్ చేసారు. ఇక ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు ఉద్యమ స్థాయిలో ప్రచారం చేయడంతో జగన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్