Friday, September 12, 2025 01:04 PM
Friday, September 12, 2025 01:04 PM
roots

జగన్.. ఇదేం లాజిక్..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏం చేస్తారో.. ఏం మాట్లాడుతున్నారో.. అనే విషయం ఎవరికీ ఆర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి జగన్ చేస్తున్న పనులు, చెబుతున్న మాటలు సొంత పార్టీ నేతలకే చిరాకు పుట్టిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అమ్మా, అయ్యా, అక్కా, చెల్లి అంటూ కాళ్లు గడ్డాలు పట్టుకున్న జగన్.. ఆ తర్వాత పూర్తిగా మారిపోయారు. కనీసం సొంత పార్టీ నేతలను కూడా దగ్గరకు రానివ్వలేదు. మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఆ నలుగురితోనే ముచ్చట్లు… వ్యాపార లావాదేవీలు కూడా. చివరికి ఎన్నికల ప్రణాళికలు కూడా ఆ నలుగురితో కలిసే చేశారు. ఇంతకీ ఆ నలుగురు ఎవరూ అంటే.. సొంతపార్టీ వాళ్లే. ఇంకా చెప్పాలంటే.. జగన్ చెప్పినట్లు నడుచుకునే వాళ్లే. జగన్ మాటకు ఎదురు చెప్పని వాళ్లు. ఎందుకంటే.. ఎదురు చెబితే.. ఏం జరుగుతుందో వాళ్లకు బాగా తెలుసు.

Also Read : జగన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. వాడు వీడు అంటూ విసుర్లు

ఒక్క సంతకం చేయనందుకే సీఎస్ పదవి నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యంను తొలగించారు జగన్. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా జగన్ వ్యవహరించారు. ఐదేళ్ల పదవీ కాలంలో నియంతలా వ్యవహరించిన జగన్.. ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ఇప్పటికే తానే సీఎం అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అరాచకాలను జగన్ మర్చిపోయినట్లున్నారు. చివరికి టీడీపీ నేతలు నామినేషన్ వేయకుండా వారిని కిడ్నాప్ చేసి, దాడులు చేసిన చరిత్ర వైసీపీ నేతలదే. అలాంటి అక్రమాలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు సుద్దపూస కబుర్లు చెబుతున్నారు. వాస్తవానికి కూటమి సర్కార్ ఏకపక్షంగా, టీడీపీ నేతలు గూండాల్లా వ్యవహరించి ఉంటే.. 11 మంది నామినేషన్ వేసేవాళ్లా… ఎన్నికల ప్రచారం జరిగేదేనా.. అనేది ఆ పార్టీ నేతల ప్రశ్న.

ఇక పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలు చేశారని వైఎస్ జగన్ పదే పదే ఆరోపించారు. మాజీ ప్రతినిధిని పట్టుకుని వాడు వీడు.. అంటూ వ్యాఖ్యానించారు జగన్. మరో అడుగు ముందుకు వేసిన జగన్.. ఈసారి కాంగ్రెస్, టీడీపీ ఒకటే అంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, రాహుల్ గాంధీతో మిలాఖత్ అయ్యారని.. అందుకే రాహుల్ గాంధీ ఏపీలో ఓటర్ లిస్టుపై మాట్లాడటం లేదన్నారు జగన్. తక్షణమే రాహుల్ గాంధీ ఏపీలో ఓటర్ లిస్టులో అక్రమాలు, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. దీని వల్ల పరోక్షంగా జగన్ తన బలహీనతను బయటపెట్టుకున్నారనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.

Also Read : సచిన్ కు అడ్డురాని వయసు కోహ్లీకి వచ్చిందా..?

రాజకీయాల్లో రాణించాలంటే.. ముందు శత్రువును భయపెట్టే బలం ఉండాలి. అందుకే ఒంటరిగా కంటే.. పొత్తుతో ముందుకు వెళ్లేందుకే చంద్రబాబు మొగ్గు చూపిస్తారు. దీని వల్ల తన బలం పెరుగుతుందనేది ఆయన భావన. ప్రస్తుతం ఎన్‌డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. పైగా ప్రస్తుత మోదీ సర్కార్‌లో ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం ఏపీకి నిధులు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి. చంద్రబాబు అడగటమే ఆలస్యం అన్నట్లుగా కేంద్రం నిధులు కేటాయిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా మోదీకి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇలాంటి సమయంలో చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య బలమైన సంబంధాలున్నాయనేది జగన్ ఆరోపణ. వాస్తవానికి రాజకీయాల్లో ఒంటరితనం చాలా ప్రమాదం. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా పొత్తు లేకుండా గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. 2004లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాల్సి వచ్చింది. నాటి ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4 పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ప్రస్తుతం ఏదో ఒక కూటమి మద్దతు ఉంటేనే గెలిచే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు వెనుక నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దల అండ ఉందనే పుకార్లు ఇప్పటికీ వినిపిస్తోంది. అందుకే ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు జగన్. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు తెలిపారు కూడా.

Also Read : సబ్జెక్టు తెలియకుండా జగన్ విమర్శలు.. రాహుల్ పై తొందరపాటు వ్యాఖ్యలు..?

పొత్తు ఉంటేనా ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉంటారనేది ప్రస్తుతం రాజనీతి. కానీ వైఎస్ జగన్ తీరు చూస్తే మాత్రం.. అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క పార్టీతో సఖ్యతగా లేరు. ఇటు ఎన్డీఏ కూటమితో, అటు ఇండియా కూటమితో కూడా వైరం పెట్టుకున్నారు. మన అని చెప్పుకునేందుకు ఒక్క బీఆర్ఎస్ తప్ప ఎవరూ జగన్ వెంట లేరు. ఆ బీఆర్ఎస్‌కు ఏపీలో ఒక్క ఓటు కూడా లేదు. ఇలాంటి సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి అందరితో టచ్‌లో ఉన్నారని జగన్ స్వయంగా వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి అత్యంత శక్తిమంతుడు అంటే.. తాను అంత బలహీనుడిని అనే సంకేతాలు ప్రజల్లోకి జగనే స్వయంగా ఇస్తున్నారా.. అనేది వైసీపీ నేతల ప్రశ్న. అసలు ఏపీలో ఓటర్ లిస్టులో అక్రమాలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించే జగన్.. అదే పని తాను ఎందుకు చేయటం లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్