Friday, September 12, 2025 05:23 PM
Friday, September 12, 2025 05:23 PM
roots

వైసీపీ నేతల్లో ఆ భయం.. కూటమికి బలం..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 2009 ఎన్నికల ముందు వరకు పెద్దగా తెలియదు. కేవలం పులివెందుల నియోజకవర్గం, కడప జిల్లా నేతలకు మాత్రమే జగన్ సుపరిచితుడు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికే టీడీపీకి అనుకూలంగా మీడియా ఉందనే విషయాన్ని గుర్తించిన జగన్… తండ్రి అండతో సాక్షి పత్రిక, ఛానల్ ప్రారంభించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే అనూహ్యంగా వైఎస్ఆర్ మృతితో జగన్ పేరు ఉమ్మడి ఏపీలో మారుమోగిపోయింది. సంతకాల సేకరణ, వారసుడు అనే మాటలతో తర్వాత సీఎం జగన్ అనే మాట బలంగా వినిపించింది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రోశయ్యను ఆ పదవిలో కూర్కొబెట్టింది. దీంతో అధిష్ఠానంపై కోపంతో 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు జగన్. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు వైసీపీకి మద్దతు తెలిపారు.

Also Read : పిల్లను ఇచ్చా అంతే.. జగన్ పై సాయి రెడ్డి సంచలనం

జగన్ పార్టీతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన టీడీపీ, కాంగ్రెస్… అక్రమాస్తుల ఆరోపణలు చేశారు. దీనిపై సీబీఐ విచారణకు నాటి యూపీఏ సర్కార్ ఆదేశించింది. 16 నెలలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్.. సానుభూతితో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. జగన్ జైలులో ఉన్నప్పుడు సోదరి షర్మిలతో పాదయాత్ర చేయించారు. ప్రజల్లో తనపై సానుభూతి పెరిగేలా ప్లాన్ చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో పూర్తిగా ఏపీకే పరిమితమయ్యాడు జగన్. 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. ప్రతిపక్షానికే పరిమితమయ్యాడు. జగన్ తీరుతో 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయడంతో.. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదనే సాకుతో మరోసారి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 14 నెలలు పాదయాత్ర చేపట్టారు. ఉదయం 10 కిలోమీటర్లు, సాయంత్రం 10 కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేశారు. ఇదే సమయంలో కోడి కత్తి దాడితో జగన్‌పై ప్రజల్లో సానుభూతి కాస్త పెరిగింది. ఇక సరిగ్గా ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగడంతో.. దానిని టీడీపీ నేతలే చేయించారని తప్పుడు ప్రచారం చేయించారు. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలిచింది. నాటి నుంచి జగన్ తీరు పూర్తిగా మారిపోయింది.

Also Read : రజనీ కేసు ఆగినట్టేనా…? గవర్నర్ రియాక్షన్ ఎక్కడ…?

అప్పటి వరకు ఏదో ఒక సాకుతో పాదయాత్రలు, ఓదార్పు యాత్రలతో ప్రజల్లో సానుభూతి సాధించిన జగన్.. సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత నుంచి మారిపోయారు. సొంత పార్టీ నేతలను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. మంత్రులకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఇక బయటకు వస్తే పరదాల మాటునే ప్రయాణం. దీంతో జగన్‌ నియంతృత్వ పోకడలతో సొంత పార్టీ నేతలే “నీకో దండం సామీ” అని చెప్పేసి పార్టీ మారిపోయారు. చివరికి ఏపీలో ఏలాంటి అభివృద్ధి చేయకపోవడంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయినా సరే జగన్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పార్టీ నేతలు, కార్యకర్తలకు దూరంగా బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితమయ్యారు. చివరికి పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు కూడా జగన్ దూరంగానే ఉన్నారు. పార్టీ నేతలను, శ్రేణులను మాత్రం “జనంలోకి వెళ్లండి… పోరాటాలు చేయండి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి” అంటున్నారు తప్ప… జగన్ మాత్రం ప్యాలెస్ దాటి కాలు బయటపెట్టడం లేదు. దీంతో కూటమి నేతలు వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. జగన్ అహంకారం, అజ్ఞానం, లెక్కలేనితనమే తమకు శ్రీరామరక్ష అంటున్నారు. కూటమి గెలుపు వెనుక జగన్ బలహీనతలు ఉన్నాయంటున్నారు. వైసీపీ భవిష్యత్తు పూర్తిగా జగన్ మార్పు పైనే ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. జగన్ ఒంటెద్దు పోకడలకు పోతే… రాబోయే రోజుల్లో వైసీపీలో భజన పరులు తప్ప.. ఎవరూ ఉండరనేది వాస్తవం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్