మిడిల్ ఈస్ట్ దేశాల్లో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. పెద్దన్న అమెరికా పెత్తనంతో గల్ఫ్ దేశాలతో పాటుగా ఇతర దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. తమ మాట వినని దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించే అమెరికా ఇప్పుడు ముస్లిం దేశం ఇరాన్ కు చుక్కలు చూపిస్తోంది. న్యూక్లియర్ ఆయుధాల ఒప్పందం విషయంలో ఇరాన్ కఠినంగా వ్యవహరించడంతో ఇజ్రాయిల్ ను రంగంలోకి దింపింది అమెరికా. ముందు నుంచి అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది ఇరాన్.
Also Read : బైబిల్ మీద ప్రమాణం.. ఫోన్ టాపింగ్ ఆడియో విన్నా: వైఎస్ షర్మిల
ముందు ఇజ్రాయిల్ దాడులను తట్టుకునే నిలబడిన ఇరాన్ ఇప్పుడు మాత్రం ఇబ్బందులు పడుతోంది. ఇరాన్ చుట్టూ ఉన్న దేశాల్లో అమెరికా బలగాలు కూడా పెద్ద ఎత్తున ఉండటంతో.. ఆదేశం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది. పెద్ద ఎత్తున బాలిష్టిక్ క్షిపణి దాడులు చేసిన ఇరాన్ యుద్ధంలో ముందుకు అడుగు వేయలేకపోయింది. తమకు పాకిస్తాన్ కూడా సహకరించే అవకాశం ఉందని ఇరాన్ ప్రకటించడం ఒక్కసారిగా అంతర్జాతీయంగా సంచలనగా మారింది. ఈ టైంలో ఇజ్రాయిల్ నుంచి వచ్చిన ఓ ప్రకటన పాకిస్తాన్ కు చెమటలు పట్టిస్తోంది.
Also Read : ఎన్నికల రంగంలోకి నందమూరి వారసురాలు..!
ఈ రెండు దేశాల వద్ద న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని.. ఇరాన్ పని పట్టిన తర్వాత తమ టార్గెట్ పాకిస్తాన్ అంటూ హెచ్చరించింది ఇజ్రాయిల్. పాకిస్తాన్ విషయంలో కఠినంగా ముందుకు వెళ్లబోతున్నామని పేర్కొంది. ఓవైపు అమెరికా పాకిస్థాన్ ను కాపాడే ప్రయత్నం భారత్ విషయంలో చేసినా.. ఇరాన్ విషయంలో పాకిస్థాన్ అనుసరించిన వైఖరితో ఇజ్రాయిల్ కఠిన దాడులకు దిగే అవకాశాలు కనబడుతున్నాయి. టర్కీకి ఇజ్రాయిల్ కు గొడవలు ఉన్న నేపథ్యంలో.. టర్కీతో పాకిస్తాన్ స్నేహం చేస్తోంది. దీంతోనే పాకిస్తాన్ విషయంలో కఠినంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది ఇజ్రాయిల్.