మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. గాజా విషయంలో ఇజ్రాయిల్ అనుసరిస్తున్న వైఖరిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపు రెండేళ్ళ నుంచి గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నారు. కాల్పులు, దాడులు ఆపాలి అంటూ ఇజ్రాయిల్ ను హెచ్చరించారు. అయితే ఇజ్రాయిల్ మాత్రం తన పంథాను కొనసాగించింది. గాజా విషయంలో తన వైఖరిని స్పష్టం చేసింది.
Also Read : ఆస్ట్రేలియాకు భారీగా కోహ్లీ ఫ్యాన్స్..!
బాంబు దాడులను ఆపాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన వెంటనే గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు విడిచారు అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఏళ్ళ తరబడి అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా ప్రయత్నం చేస్తోంది. ఈ నేపధ్యంలో గాజా ప్రాంతంలో శాంతి కోసం ట్రంప్ 20 అంశాల ప్రణాళికను ఆవిష్కరించారు. దీనిని ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు సైతం ప్రణాళికను స్వాగతించారు.
Also Read : శభాష్ వైజాగ్ పోలీస్.. యూపీలో ఖాకీ సినిమా రిపీట్
ఈ ప్రణాళిక ప్రకారం.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ, హమాస్ బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా శుక్రవారం, ఉగ్రవాద సంస్థ హమాస్, శాంతి ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరించినట్లు తెలిపింది. వాటిలో అధికారాన్ని వదులుకోవడం, బందీలను విడుదల చేయడం వంటివి ఉన్నాయి. ఇక మిగిలిన విషయాలకు మాత్రం చర్చలు జరగాల్సి ఉందని పేర్కొంది. హమాస్ ప్రకటన తర్వాత, ఇజ్రాయెల్ శాంతి ప్రణాళికలో భాగంగా మొదటి దశను అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. కానీ ఈ సమయంలో ఈ దాడులు జరిగాయి. కాగా 2023 అక్టోబర్ లో హమాస్.. ఇజ్రాయిల్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 1,219 మంది ఇజ్రాయెలీయులను హతమార్చింది. ఇక అక్కడి నుంచి ఇజ్రాయిల్.. హమాస్ టార్గెట్ గా దాడులకు దిగింది.