Tuesday, October 28, 2025 07:25 AM
Tuesday, October 28, 2025 07:25 AM
roots

కేసులంటే అంత భయం ఎందుకో..!

అరెస్టు చేస్తే.. ఏమవుతుంది.. జైలుకు వెళ్తాం.. జైలు మాకేమన్నా కొత్తా… గతంలో 16 నెలలు జైలులో ఉన్నారు కదా.. మాకేం భయం లేదు.. ఈ మాట చెప్పింది వైసీపీ కార్యకర్త. రెండు రోజుల నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. జగన్‌కు కేసులు కొత్త కాదు.. జైలు కొత్త కాదు.. అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్.. అక్కడ నుంచే పార్టీ కార్యక్రమాలు నడిపించారు. జైలులోని గెస్ట్ హౌస్‌లో నాటి కాంగ్రెస్ పెద్దల అండతో సకల భోగాలు అనుభవించారు. 24 గంటలూ అందుబాటులో ఫోన్.. ఎవర్ని కలవాలనుంటే వాళ్లతో ములాఖాత్.. ఇదంతా నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అండతోనే జరిగిందనే ఆరోపణలున్నాయి కూడా. వాస్తవానికి 16 నెలల పాటు అధినేత జైలులో ఉంటే.. కొత్తగా పెట్టిన పార్టీ ముందుకు సాగటం చాలా కష్టం. కానీ వైసీపీ విషయంలో మాత్రం.. మరింత బలపడింది. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకుంది.

Also Read : కన్నప్పకు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?

ఇదంతా 2014 ఎన్నికలకు ముందు కథ. ఆ ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు తెచ్చుకున్న జగన్.. నాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ సమయంలో కేసుల పెట్టినా కూడా ఏ మాత్రం భయపడలేదు. పైగా 2014-2019 మధ్య కాలంలో ప్రతి శుక్రవారం కోర్టు వాయిదాలకు కూడా హాజరయ్యారు. పాదయాత్ర సమయంలో కూడా వాయిదాలకు వెళ్లారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం హోదాలో వాయిదాలకు హాజరవ్వాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని.. పైగా సెక్యూరిటీ సమస్యలు కూడా వస్తాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా హాజరు కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే ఎన్నికల్లో ఓడిన తర్వాత మళ్లీ వాయిదాలుంటాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

Also Read : లోయర్ ఆర్డర్ బాగు పడదా..?

13 ఏళ్లు దాటినా కూడా అక్రమాస్తుల కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఇటీవల ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసు కూడా త్వరలో ముగుస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటికీ ఆ కేసు విచారణ ముందుకు సాగటం లేదు. తాజాగా జగన్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. వీటిల్లో సింగయ్య మృతి కేసు జగన్‌ మెడకు చుట్టుకునేలా ఉంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడే సింగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో జగన్ కారు ఫుట్ బోర్డు మీద నిలబడి ఉన్నారు. అందుకే అంతమంది జనం జగన్‌ వాహనాన్ని చుట్టుముట్టారు. ఆ తోపులాట వల్లే సింగయ్య కారు కింద పడ్డాడు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించిన పోలీసులు కారు డ్రైవర్‌తో పాటు జగన్‌, విడదల రజిని, పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు. పర్యటనపై ఆంక్షలు విధించినా కూడా వాటిని ఉల్లంఘించారనే ఆరోపణతో జగన్‌పైన కేసు నమోదైంది.

Also Read : జీర్ణ సమస్యలు ఉన్నాయా..? ఈ 5 తింటే చాలు

అయితే నిన్నటి వరకు కేసులంటే ఏ మాత్రం భయపడని జగన్.. ఇప్పుడు మాత్రం భయపడుతున్నట్లున్నారు. అందుకే తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అది కూడా అర్జెంటుగా విచారించాలని కోర్టును కోరారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. అప్పటికప్పుడు విచారించడం సాధ్యం కాదని తేల్చేసింది. 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్.. ఐదేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. మరి అలాంటి జగన్ ఇప్పుడు కేసులకు ఎందుకు భయపడుతున్నారనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేసులు ఎదుర్కొనే ధైర్యం జగన్ కోల్పోతున్నారా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్