వైసీపీ అధికారంలో ఉన్న లేకపోయినా సరే కొంతమందికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా సంపాదించుకున్న కొంతమంది నాయకులు ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ లో సంపాదించుకోవడం మొదలుపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు వైసీపీ నేతలకు సహకరిస్తున్నారు అనే ఆరోపణలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. తాజాగా వైసిపి మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యవహారం విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : కోడెలకు అండగా నిలిచాననే జగన్ దూరం పెట్టారు: రఘురామ
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుని ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించిన ఆర్కే రోజా ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వంలో తన డామినేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవల కాలంలో కాస్త సైలెంట్ అయినట్లు కనపడిన ఆమె ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తిరుపతిలో ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. గతంలో ఏ విధంగా అయితే విమర్శలు చేసేవారో ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో ఆమె దూకుడు పెంచారు.
Also Read : జగన్‌కు ఈడీ బిగ్ షాక్..!
ఇక కూటమి ప్రభుత్వంలో రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఆర్కే రోజాకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో పడిన ఆర్కే రోజా పనులను ఇప్పుడు ఆ మంత్రి పర్సనల్ గా తీసుకుని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇటీవల విజయవాడ వచ్చిన రోజా మంత్రి అధికారిక నివాసంలోకి నేరుగా వెళ్లిపోయారు. రాయలసీమలో తాను చేస్తున్న కొన్ని వ్యాపారాలకు ఇబ్బందులు ఉండటంతో నేరుగా మంత్రిని కలిశారు రోజా. స్వయంగా రోజా వచ్చి తనని కలవడంతో మంత్రి.. చక చక ఆమె ఫైల్ ను మూవ్ చేశారట. ఈ వ్యవహారం ఇటీవల మీడియాలో కాస్త హడావుడి అయింది. అయినా సరే మంత్రి తీరులో మాత్రం మార్పు లేదంటున్నాయి రాజకీయ వర్గాలు.




