తెలుగు ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కడం అంటే సాధారణ విషయం కాదు. ఒక్కసారి అవకాశం వస్తే దాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కష్టపడాల్సి ఉంటుంది. వీవీఎస్ లక్ష్మణ్ మినహా ఈ మధ్య కాలంలో మన తెలుగు ఆటగాళ్ళు జాతీయ జట్టులో ప్రభావం చూపలేకపోతున్నారు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆస్ట్రేలియాలో సెంచరీ తర్వాత నితీష్ నిలకడగా రాణించలేదు.
Also Read : శ్రీశాంత్ కూతురు అన్న మాటలకు కన్నీళ్లు ఆగలేదు
ఐపిఎల్ లో కూడా అతను దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ నుంచి తుది జట్టులోకి వచ్చిన అతను.. బౌలింగ్ లో కాస్త పర్వాలేదు అనిపించాడు. బ్యాటింగ్ లో మాత్రం ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ సమయంలో గాయం అతని కెరీర్ ను దెబ్బకొట్టే సంకేతాలు కనపడుతున్నాయి. జిమ్ చేస్తున్న సమయంలో కాలి లిగమెంట్ కట్ కావడంతో సీరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గాయం తర్వాత అతను పునరాగమనం చేయడం ప్రశ్నార్ధకమే అని చెప్పవచ్చు.
Also Read : నిజంగానే చంద్రబాబు పగ తీర్చుకున్నారా..?
ప్రస్తుతం ఫాంలో లేని నితీష్ కుమార్ రెడ్డి, గాయం నుంచి కోలుకోవడం, తిరిగి ఫిట్నెస్ సంపాదించడం, ఫాంలోకి రావడం అంత సులభం కాదు. దీనికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ సమయంలో ఎవరైనా యువ ఆటగాడు తన సత్తా నిరూపించుకుంటే మాత్రం నితీష్ ఇబ్బందుల్లో పడినట్టే. వైద్యం పూర్తైన తర్వాత ఎన్సియేలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి దేశవాళి క్రికెట్ లో నిరూపించుకోవాలి. ఈ లోపు భారత్ చాలా మ్యాచ్ లు ఆడనుంది. మరి నితీష్ ఎంత వరకు ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి.