Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

జగన్ రాజకీయ జీవితానికి శుభం కార్డు పడ్డట్లేనా?

చేసిన పాపం ఎప్పటికైనా వెంటాడుతుంది అనే మాట వాస్తవం. ఇది ఈరోజు చెబుతున్న మాట కాదు.. మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్న మాటే. ఇప్పుడు లడ్డూ వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ జీవితానికే ముగింపు పలికే పరిస్థితి వచ్చింది. తిరుమల కొండ విషయంలో కోట్లాది మంది భక్తులు మతాలు, కులాలతో సంబంధం లేకుండా ఎంతో పవిత్రంగా ఉంటారు. ఎంతో నిష్ఠగా దేవాలయానికి వస్తు ఉంటారు. అలాంటి దేవాలయంలో ఆ తరహా చర్య అనేది మహా పాపం కంటే ఎక్కువే. అది నిజంగా జరిగితే మాత్రం హిందువులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు ఎవరూ వైసీపీని క్షమించే అవకాశమే లేదు.

ఈ విషయంలో వైసీపీ ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో అయితే లేరు. నివేదిక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు కేంద్రం నుంచి వచ్చింది. కాబట్టి వైసీపీకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. సిబిఐ కేసుల నుంచి తప్పించుకున్న జగన్ ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఒక ప్రాంతీయ పార్టీ మీద దేశ వ్యాప్తంగా నిరసన చేయడం బహుశా జగన్ విషయంలోనే జరిగింది. కేంద్రం కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉందని తెలుస్తుంది. అటు ప్రజల్లో కూడా అనుమానాలు బలపడుతున్నాయి. 320 రూపాయలకు ఆవ్వు నెయ్యి ఎలా వస్తుంది అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి.

Read Also : బిజెపి విషయంలో బాబు సూపర్ సక్సెస్.. ఇవిగో ఆధారాలు

నిన్న ప్రెస్ మీట్ పెట్టినా జగన్ సరిగా మాట్లాడలేకపోయారు. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో సీరియస్ అయింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే టీటీడీ లడ్డూ – కల్తీ నెయ్యి విషయంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఈఓ ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోజు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలకు ప్రభుత్వం దిగే అవకాశం కనపడుతోంది. చట్టపరమైన చర్యలతో పాటు ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నివేదిక అందిన తర్వాత ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్