పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్.. అనంతరం అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ.. ఈ మూడు పరిణామాల మధ్య చోటు చేసుకున్న కొన్ని ఘటనలు ఈ ఏడాది ఓ సెన్సేషన్. ముఖ్యంగా పాకిస్తాన్ గగనతలంలో భారత విమానాలు ఎగరకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అటు పాకిస్తాన్ విమానాలకు సైతం భారత్ గగనతలంలో నో ఏంటీ బోర్డు పెట్టింది. దీనితో విమానయాన సంస్థలకు ఇప్పుడు ఇది అదనపు భారంగా మారింది. షార్ట్ కట్ రూట్ ఉన్నప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళడంతో భారీగా ఖర్చు అయ్యే పరిస్థితి.
Also Read : కార్యకర్తల మాట వినాల్సిందే.. నేతలకు చంద్రబాబు వార్నింగ్..!
దీనితో విమానయాన సంస్థలు కూడా ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాయి. ఈ నేపధ్యంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. తుఫాను బాధిత శ్రీలంకకు సహాయ సామగ్రిని తీసుకెళ్లే పాకిస్తాన్ విమానానికి భారత ప్రభుత్వం వేగంగా అనుమతులు జారీ చేసింది. కానీ పాక్ మీడియాలో మాత్రం.. శ్రీలంకకు సహాయం చేసే విమానాన్ని.. భారత గగనతలంలోకి అనుమతించలేదు అనే వార్తలు వచ్చాయి. దీనిపై భారత్ మండిపడింది. పాకిస్తాన్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఓవర్ ఫ్లైట్ కోసం అభ్యర్థనను సమర్పించిందని భారత అధికారులు తెలిపారు.
Also Read : అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తున్న విడుదల రజనీ..?
అదే రోజు భారత గగనతలం మీదుగా ఎగరడానికి అనుమతి కోరిందని అధికారులు వెల్లడించారు. శ్రీలంకకు మానవతా సహాయం అందించాలనే అభ్యర్థన నేపధ్యంలో భారత్ అనుమతి ఇచ్చిందని తెలిపింది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. పాకిస్తాన్.. భారత గగనతలాన్ని ఉపయోగించుకోవడంపై నిషేధం విధించినప్పటికీ, ఈ విమానానికి అనుమతి మాత్రం మానవతాకోణంలో ఇచ్చిన అనుమతిగా పేర్కొంది. దీనితో భవిష్యత్తులో రెండు దేశాల గగనతలాల్లో విమానాల ప్రవేశాలకు అనుమతి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

