Tuesday, March 10, 2026 09:32 PM
Tuesday, March 10, 2026 09:32 PM

సరికొత్త వ్యూహం.. తీవ్రత పెంచిన ఇరాన్..!

బలవంతుడితో పోరాటం చేయడం కంటే.. మొండి వాడితో పోరాటం చేయడం చాలా కష్టం. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్దంలో అర్ధమవుతోన్న సామెత ఇదే. యుద్ధం మొదలయ్యే వరకు.. ఇరాన్ బెదిరిస్తుందని ప్రపంచం చూసింది కాని.. ఇస్లామిక్ రిపబ్లిక్ బలాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇరాన్ వేస్తున్న బాంబులు, చేస్తున్న దాడులు చూస్తుంటే.. ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుడుతుంది. ఏ సమయంలో ఏ ఆయుధంతో తమ దేశంపై విరుచుకుపడుతుందో అర్ధం కాక గల్ఫ్ దేశాలు కంగారు పడుతున్నాయి.

Also Read : ఏపీ పంచాయతీల్లో విప్లవాత్మక మార్పు

ఇప్పుడు మళ్ళీ ఇరాన్ తన యుద్ద వ్యూహాన్ని మార్చేసింది. ఇరాన్ ఆర్మీ ఇక నుంచి.. 1,000 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ పేలోడ్‌ లతో మాత్రమే క్షిపణులను ప్రయోగిస్తుందని సీనియర్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ చెప్పిన తర్వాత నుంచి ఇరాన్ ఆ దాడులను మొదలుపెట్టింది. దీని కారణంగా యుద్ధం తీవ్రత పెరుగుతుంది. క్షిపణికి తాను నాశనం చేయగలిగే సామర్ధ్యాన్ని ఇరాన్ పెంచింది. విధ్వంశం కూడా భారీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే గల్ఫ్ దేశాలను కూడా కంగారు పెడుతున్న అంశం.

ఇజ్రాయిల్, అమెరికా సైనిక స్తావరాలతో పాటుగా గల్ఫ్ దేశాల్లో ఇరాన్ చేస్తున్న దాడులు ఇప్పుడు వీటితోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాషింగ్టన్‌ కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం, ఇరాన్ మధ్యప్రాచ్యంలో అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన క్షిపణి ఆయుధాలను సొంతం చేసుకుంది. ఈ ఆయుధశాలలో సౌమర్ అనే క్రూయిజ్ క్షిపణి ఉంది. దీని అణు సామర్థ్యం 3,000 కిలోమీటర్ల గరిష్ట పరిధితో దాడి చేసే విధంగా తయారు చేసారు. సెజ్జిల్ అనే మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధితో మరో క్షిపణి ఉంది.

Also Read : లిక్కర్ కేసులో ఆ ఇద్దరే అంతా.. ఆస్తులు కొనేసారు..!

ఇప్పటి వరకు 550 కిలోల పేలుడు పదార్ధాలు ఉన్న క్షిపణితోనే ఇరాన్ దాడులకు దిగింది. ఇక ఇరాన్ వద్ద ఉన్న మూడవ చాయిస్.. ఖోర్రామ్‌షహర్ MRBM, ఈ క్షిపణి టెక్నాలజీని ఉత్తర కొరియా నుంచి తీసుకున్నారు. ఆ దేశ క్షిపణి హ్వాసొంగ్-10 నుండి తీసుకుని తయారు చేసారు. దీని పరిధి 2,000-3,000 కి.మీ ఉంటుందని సమాచారం. ఇది ఏకంగా 1,800 కిలోల వరకు పేలుడు పదార్ధాలను మోస్తుంది. ఖైబార్ షెకాన్ అనే క్షిపణి కూడా ఇరాన్ వద్ద ఉంది. దీని సామర్ధ్యం కాస్త తక్కువే అయినా.. నష్టం మాత్రం ఎక్కువే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరువూరుకు కొత్త బాస్.....

వరుసగా నాలుగు సార్లు పార్టీ ఓడిన...

ఏపీ పంచాయతీల్లో విప్లవాత్మక...

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల వర్గీకరణ విధానంలో...

జగన్‌ తప్పు చేశాడా..?...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై...

పవన్ మాట వినరేం..?...

జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పవన్...

లిక్కర్ కేసులో ఆ...

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో ఈడీ అధికారుల...

హోటల్స్ బంద్.. నిన్న...

ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం...

పోల్స్