ఐఫోన్.. స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఈ రేంజ్ లో దగ్గరైన మొబైల్ మరొకటి లేదు. చాలా మందికి అది డ్రీం కూడా. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ఐఫోన్ ను స్టేటస్ సింబల్ గా కూడా భావిస్తూ ఉంటారు. దీనితో ఆపిల్ సంస్థ కూడా భారత్ లో పెట్టుబడులు పెడుతోంది. తమ మొబైల్స్ కు భారీ మార్కెట్ క్రియేట్ చేసుకునేలా ఆఫర్ లు ఇస్తోంది. ప్రతీ ఏటా సెప్టెంబర్ లో తమ లేటెస్ట్ సీరీస్ ను లాంచ్ చేసే ఆపిల్.. ఇప్పటి వరకు 16 ఐఫోన్ సీరీస్ లను లాంచ్ చేసింది. ఇప్పుడు 17కి సిద్దమైంది.
Also Read : రష్యాతో ఉంటారా.. సిగ్గుచేటు.. అమెరికా సంచలన కామెంట్స్
తమ ఐఫోన్ మోడల్స్ అన్నీ భారత్ లోనే తయారు చేస్తోంది. బెంగళూరులో ఇప్పటికే తయారి మొదలైపోయింది కూడా. వారం రోజుల్లో మార్కెట్ లో ఐఫోన్ 17 ను రిలీజ్ చేయనుంది ఆపిల్ సంస్థ. ఇక ఐఫోన్ 17 ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈసారి ఐఫోన్ ప్లస్ మోడల్ ఉండే అవకాశం లేదని సమాచారం. ఆ మోడల్ కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో దాన్ని విత్ డ్రా చేసుకుని దాని స్థానంలో ఎయిర్ మోడల్ ను ప్రవేశ పెడుతుంది.
ఎయిర్ ఇప్పటికే ఐప్యాడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీని ధర 899 డాలర్ల నుంచి 949 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ను 899 డాలర్ల ధరతో రిలీజ్ చేసింది. అయితే ఐఫోన్ 17 ప్రో ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 100 డాలర్లు ఎక్కువగా ఉంది. కాబట్టి ధర 1,099 డాలర్ల వరకు ఉంటుంది. ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే మరో వంద డాలర్లు ఎక్కువగా ఉంటుంది.
Also Read : బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా దేవినేని వారసుడు..?
మన కరెన్సీలో ఐఫోన్ 17 మళ్ళీ 16 మాదిరిగానే దాదాపు రూ.79,900 ధరకు లాంచ్ కావచ్చు. ప్రో మ్యాక్స్ రూ.1,44,900 వద్ద ఉండవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ ధర రూ.89,900 లేదా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అయితే ఐఫోన్ 17 ప్రో ధర పెరుగుదల కారణంగా రూ.1,30,000కి దగ్గరగా ఉండవచ్చు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8,800. ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.