వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళారు. బంగారు పాల్యం పర్యటనకు వెళ్ళిన జగన్.. అక్కడ మామిడి రైతులను పరామర్శించే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా అక్కడ వైసీపీ కార్యకర్తలు చేసిన హడావుడి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జగన్ పర్యటనకు ముందే పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించిన వైసీపీ కార్యకర్తలు.. జగన్ రాకముందే మార్కెట్ యార్డు గేట్లను తోసుకుని లోపలికి వెళ్ళారు. మామిడి రైతులతో ముఖాముఖికి మార్కెట్ యార్డుకు జగన్ వెళ్ళారు.
Also Read : గంటాకు కోపం వచ్చింది.. ఈసారి నేరుగానే..!
గత ఘటనల దృష్ట్యా పర్యటనలో ఆంక్షలు విధించిన పోలీసులు… ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్ కు 500 మందికి పోలీసుల అనుమతి ఉంది. ఇక హెలీప్యాడ్ వద్దకు 30 మందికి అనుమతిచ్చిన పోలీసులు.. ర్యాలీలు, బహిరంగసభలు పూర్తిగా నిషేధించారు. జనసమీకరణకు యత్నిస్తున్న 370 మంది వైసీపీ నేతలకు ఇప్పటికే పోలిసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇదే సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మామిడి మార్కెట్ సమీపంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం, పుష్కా పంపిణీ చేసారు.
Also Read : ఇంకెన్ని రోజులు సార్.. ఇలా..?
మద్యం కోసం వైసీపీ కార్యకర్తలు కొట్టుకోగా.. ఓ కార్యకర్త తలకు గాయం అయింది. తన కర్చీఫ్‌తో కట్టుకట్టి కుర్చీలో బంగారుపాళ్యం ఎస్ఐ కూర్చోబెట్టారు. ఇక రైతులు లేకుండా.. వైసీపీ కార్యకర్తలతో హల్‍చల్ చేసారు జగన్. రోడ్డుపై మామిడి కాయలు పోసి హైడ్రామా చేసారనే ఆరోపణలు వినపడుతున్నాయి. పక్కా ప్లాన్‍తో నిన్ననే మామిడి పళ్ల ట్రాక్టర్లను వైసీపీ నేతలు సిద్దంగా ఉంచారు. జగన్ వచ్చే సమయంలో రోడ్డుపై మామిడి కాయలు పారబోసి ఆ దృశ్యాలతో తప్పుడు ప్రచారం చేసేందుకు ప్లాన్ చేసిందని ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వ చర్యలతో సాఫీగా జరుగుతున్న మామిడి కొనుగోళ్లు చూసి.. ఏం చేయాలో అర్థం కాక వికృత చేష్టలకు వైసీపీ నేతలు దిగారని టీడీపీ విమర్శిస్తోంది.