టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ ది మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ సౌత్ తో పాటుగా నార్త్ లో కూడా హాట్ టాపిక్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు.. బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ నెగటివ్ రోల్ చేసిన వార్ 2 సినిమా రిలీజ్ కాగా.. త్వరలోనే మరో సినిమాకు సైన్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇటు తెలుగులో ప్రశాంత్ నీల్ సినిమాలో డ్రాగన్ అనే సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
Also Read : ఏపీలో దసరా సెలవుల్లో మార్పులు..!
ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో కూడా ఓ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు. ఇదే టైం లో గత ఏడాది వచ్చిన దేవర సినిమాకు సీక్వెల్ కూడా చేసే ఛాన్స్ ఉంది. ఇక కన్నడ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. ఇదిలా ఉంచితే.. ఇప్పుడు ఎన్టీఆర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి అనే వార్త ఫ్యాన్స్ ను కలవర పెడుతోంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఓ యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డాడు అని, అతనిని హాస్పిటల్ కు తరలించారు అనే వార్త ఒకటి బయటకు వచ్చింది.
Also Read : పాకిస్తాన్ కు ఐసీసీ షాక్.. భారీ జరిమానా..?
అయితే ఎన్టీఆర్ టీం మాత్రం.. గాయాలు తీవ్రం కాదని అంటున్నా ఫ్యాన్స్ లో మాత్రం భయం మొదలైంది. ఏ యాడ్ అనేది ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం డ్రాగన్ సినిమా కోసం.. ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కోసం 7 వారాల్లో 9.5 కిలోల బరువు తగ్గాడట. ప్రత్యేక ట్రైనర్ ను కూడా పెట్టుకుని ఎన్టీఆర్ జిమ్ లో బరువు తగ్గుతున్నాడని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ ఖచ్చితంగా సెన్సేషన్ అంటున్నాయి సినీ వర్గాలు. మేనరిజం కూడా అదిరిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు.