Tuesday, October 28, 2025 01:14 AM
Tuesday, October 28, 2025 01:14 AM
roots

అమ్మో గాయాలు.. భారత్ కు షాక్ ల మీద షాక్ లు

ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ కు కొత్త సమస్య వచ్చి పడింది. మొదటి టెస్ట్ ఓటమి తర్వాత రెండో టెస్ట్ లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. మూడవ టెస్ట్ లో ఫెయిల్ అయింది. కీలకమైన నాలుగో టెస్ట్ లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో గాయాలు జట్టు యాజమాన్యాన్ని కంగారు పెట్టేస్తున్నాయి. జట్టు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో అతని కాలికి గాయం కావడంతో సీరీస్ నుంచి తప్పుకున్నాడు.

Also Read : పంత్ ఆడాలా..? వద్దా..? గిల్ ముందు పెద్ద సమస్యే..!

స్కానింగ్ లో లిగమెంట్ కట్ అయినట్టు గుర్తించారు. ఇక పేస్ బౌలర్ లు ఆకాష్ దీప్, అర్శదీప్ సింగ్ లు కూడా గాయపడ్డారు. దీనితో జట్టులోకి అన్షుల్ కాంబోజ్ ను చేర్చింది యాజమాన్యం. అతను ప్రాక్టీస్ మ్యాచుల్లో ఆకట్టుకున్నాడు. దీనితో తుది జట్టులో ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు బౌలింగ్ విభాగం విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. సిరాజ్, బూమ్రాకు తోడుగా ఎవరు ఆడతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Also Read : ఆ రెండు పదవులిస్తే ఉంటా.. లేదంటే అంతే..!

అర్శదీప్ సింగ్ గాయం గురించి క్లారిటీ రాకపోవడంతో.. అతనిని ఆడిస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఆకాష్ దీప్ దాదాపుగా సీరీస్ నుంచి తప్పుకున్నట్టే కనపడుతోంది. దీనితో కాంబోజ్ ను తుది జట్టులోకి తీసుకోవచ్చు అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. కీలకమైన రెండు మ్యాచులలో భారత్ సత్తా చాటాలి. అటు బ్యాటింగ్ విభాగం లో కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉన్నాయి. పంత్ గాయపడటంతో అతను ఆడతాడా లేదా అనేది కూడా స్పష్టత రావడం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్