తెలుగు సినిమా పరిశ్రమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజీ కోసం సిద్ధమైందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సంధ్య థియేటర్ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో భవిష్యత్తులో తెలంగాణలో కచ్చితంగా తాము బెనిఫిట్ షోలకు గాని ప్రీమియర్ షోలోకి గాని టికెట్ ధరలు పెంచుకోవడానికి గాని ఏ విధమైన అనుమతులు ఇచ్చేది లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో రాజీ చేసుకోవడానికి సినిమా పెద్దలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ వ్యవహారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కాస్త శాంతింప చేయడానికి సినిమా పెద్దలు రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇబ్బందికరంగా మారే అవకాశం అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరలోనే సినిమా పరిశ్రమ పెద్దలు సిఎంను కలిసి సమస్య పరిష్కారం కోసం అడుగులు వేయనున్నారు.
Also Read : కేటిఆర్ పక్కాగా బుక్ అయ్యాడు.. ఏసీబీ సంచలన అడుగులు
ఈ మేరకు ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు సినిమా పెద్దలు సిద్ధమయ్యారు. తాజాగా సూర్యదేవర నాగావంశీ కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రిని త్వరలో టాలీవుడ్ ప్రముఖులు కలుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తారని ఆయన స్పష్టం చేశారు. దిల్ రాజు ద్వారా ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి దిల్ రాజు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది.




