అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా మారింది. రష్యాతో భారత్ చేస్తోన్న ఆయిల్ వ్యాపారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంకుల్ శ్యాం.. సుంకాల పేరుతో భారత్ ను బెదిరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రెండు దఫాలుగా 50 శాతం సుంకాలు విధించారు. ఇప్పుడు దీనిపై రష్యా కూడా తన వాణి వినిపించింది. తమ దేశంతో వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని భారత్, చైనాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టారు.
Also Read : హెచ్ 1 బీలకు మరో షాక్ తప్పదా..?
ఇటువంటి చర్యలు ఆర్థికంగా కూడా ఎదురుదెబ్బ తగిలే దిశగా ఉండవచ్చని హెచ్చరించారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే, అది ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదలకు కారణం అవుతుందని, వడ్డీ రేట్ లను పెంచే దిశగా ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. భారత్, చైనా.. తమను తాము అవమానించుకోవడానికి సిద్దంగా లేవన్నారు పుతిన్. భారత్.. తమ వద్ద నుంచి ఆయిల్ కొనకపోతే అది రష్యాకు నష్టమని, కానీ భారత ప్రజలు మాత్రం ఇటువంటి వ్యవహారాలను సున్నితంగా తీసుకుంటారని అన్నారు.
Also Read : ఐ బొమ్మ.. దేనికి భయపడేది లేదు..!
అమెరికా సంగతి ప్రధాని మోడీకి బాగా తెలుసనీ, దేశ ప్రజలు అవమానానికి గురయ్యే చర్యలకు ఆయన మద్దతు ఇవ్వరని కామెంట్ చేసారు పుతిన్. ఇక ఉక్రెయిన్, రష్యా యుద్దంలో భారత్ పాత్ర ఉందని ట్రంప్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. భారత్ తమకు వ్యాపార భాగస్వామి మాత్రమే అని, మంచి స్నేహితుడు అంటూ కామెంట్ చేసారు పుతిన్. కాగా ఉక్రెయిన్ పై యుద్దానికి రష్యా.. భారత్ నుంచి వెళ్ళే నిధులను వాడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అటు ఉక్రెయిన్ కూడా ట్రంప్ వ్యాఖ్యాలను ఖండించింది.