Saturday, October 25, 2025 08:53 AM
Saturday, October 25, 2025 08:53 AM
roots

అత్మహత్యకు మహ్మద్ షమీ ప్రయత్నం, అడ్డుకున్న స్నేహితుడు

గత అయిదేళ్ళ నుంచి భారత క్రికెట్ జట్టుకు పేసర్ మహ్మద్ షమీ వెన్నుముఖగా నిలుస్తున్నాడు. ప్రపంచ కప్ లో టీం ఇండియా ఫైనల్ వరకు వెళ్ళడంలో శమీ కీలక పాత్ర పోషించాడు. 24 వికెట్లతో షమీ నిప్పులు చెరిగాడు. ఇక టెస్ట్ ఫార్మాట్ లో కూడా షమీ కీలకంగా మారాడు. ఇప్పుడు గాయం కారణంగా శమీ జట్టుకి దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల సర్జరీ చేయించుకున్న షమీ వచ్చే ఆస్ట్రేలియా సీరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం కనపడుతుంది. బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సీరీస్ కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం కనపడుతుంది.

రెండు వైపులా బంతిని స్వింగ్ చేసే సామర్ధ్యం ఉన్న షమీ… యార్కర్లు, పదునైన బౌన్సర్లు సంధించే నేర్పు ఉన్న ఆటగాడు. అయితే షమీ జీవితంలో అతని వైవాహిక జీవితం అనేక ఇబ్బందులకు కారణం అయింది. అతని భార్య చేసిన ఆరోపణలు అతని కెరీర్ ను ఒకానొక దశలో ఇబ్బందిపెట్టినట్టే కనిపించాయి. పాకిస్థాన్‌పై మహ్మద్ షమీకి సంబంధించిన కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ విచారణ ప్రారంభించింది. ఆ సమయంలో షమీ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని అతని స్నేహితుడు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

ఆ సమయంలో షమీ అనేక విషయాలతో పోరాటం చేస్తున్నాడు. ఒక రాత్రి తను జీవితాన్ని ముగించాలి అనుకున్నాడని… ఆ సమయంలో తాను నీళ్ళు తాగేందుకు ఉదయం నాలుగు గంటలకు లేచాను అని… షమీ బాల్కనీ లో నిలబడి ఉన్నాడని… తాము 19 వ అంతస్తులో ఉంటున్నామని… ఏం జరిగిందో తనకు అర్ధమైంది అని… వెంటనే షమీ వద్దకు వెళ్లినట్టు ఉమేష్ అనే అతని సన్నిహితుడు శుభంకర్ మిశ్రా పోడ్‌ కాస్ట్ లో బయట పెట్టాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్