టీం ఇండియా స్టార్ పేసర్ బూమ్రాకు గాయం అనే న్యూస్ క్రికెట్ అభిమానులను కంగారు పెడుతోంది. ఈసీరీస్ లో నిలకడగా రాణిస్తున్న ఈ స్టార్ పేసర్.. ఇప్పటికే సిరీస్‌లో 32 వికెట్లు తీశాడు. సిడ్నీ టెస్ట్ లో మొదటి రోజు చివరి బంతికి ఖవాజా వికెట్ తీసిన బూమ్రా.. 2వ రోజు ఉదయం సెషన్‌లో మార్నస్ లాబుషేన్ వికెట్ తీసాడు. 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన బూమ్రా.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్ లు తీసాడు. లంచ్ అనంతర స్పెల్‌లో ఒక ఓవర్ బౌలింగ్ చేసిన తర్వాత గాయం కారణంగా మైదానం వీడాడు.
Also Read : ఆస్ట్రేలియా ఆటగాళ్ళ అతి.. బూమ్రా షాకింగ్ రిప్లై
కోహ్లీతో మాట్లాడి మైదానం నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి స్కాన్ లు చేయించాడు. టీం సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ అన్షుమాన్ ఉపాధ్యాయ్, టీమ్ డాక్టర్‌తో కలిసి ఆస్పత్రికి వెళ్ళాడు. ఇక బూమ్రా పరిస్థితిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి ఏమీ లేదని, అతను మూడవ రోజు ఉదయం బ్యాటింగ్ చేస్తాడని నేషనల్ మీడియా తెలిపింది. అయితే బౌలింగ్ విషయంలో మాత్రం రేపు అతని పరిస్థితి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఆస్ట్రేలియాకు ఈ సీరీస్ లో ఒకరకంగా బూమ్రా చుక్కలు చూపించాడు.
Also Read : గంభీర్.. దయచేసి తప్పుకో
ఆస్ట్రేలియా మైదానాల్లో ఆసియా క్రికెటర్ ఈ స్థాయిలో ఎప్పుడూ ప్రదర్శన చేయలేదు. కీలకమైన చివరి టెస్ట్ లో మూడవ రోజు అతను గాయం కారణంగా దూరమైతే మాత్రం భారత్ కు ఎదురు దెబ్బే. రెండోరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. ప్రస్తుతం 144 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్. జడేజా, సుందర్ క్రీజ్ లో ఉండగా… మరో 50 పరుగులు జత చేస్తే కచ్చితంగా ఈ మ్యాచ్ లో భారత్ కు విజయావకాశాలు ఉంటాయి. క్రమంగా పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా మారడంతో ఎంత వరకు రాణిస్తారు అనేది చూడాలి.