Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

భారత్ గెలుపు లాంఛనమేనా…?

ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో విజయం భారత్ వైపు మొగ్గు చూపుతోంది. బూమ్రా కెప్టెన్సీలో జరుగుతున్న పెర్త్ టెస్టులో భారత జట్టు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త తడబాటుకు గురైన భారత బ్యాట్స్‌మెన్… రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగిపోయారు. ఆస్ట్రేలియా జట్టును వాళ్ల సొంత గడ్డపైనే కంగారు పెట్టించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

Also Read: దుమ్ము రేపారు… ఆస్ట్రేలియాకు పగలే చుక్కలు

తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా కూడా తెరవకుండా డకౌట్ అయిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్… రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 297 బంతులాడిన జైస్వాల్… 3 సిక్సర్సు, 15 ఫోర్లతో ఏకంగా 161 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహులు 77 రన్స్‌ చేశాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియాకు బలమైన పునాది వేశారు. వన్ డౌన్‌లో వచ్చిన పడిక్కల్ 25 రన్స్ చేయగా.. పంత్, ధృవ్ జురేల్ మాత్రం చెరో సింగిల్ రన్ చేసి పెవిలియన్ చేరారు. 321 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాను విరాట్ కోహ్లీ వెన్నెముకలా మారాడు.

సుందర్, నితేష్ రెడ్డితో కలిసి భారత్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. చాలా రోజులుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ… 143 బంతులాడి 2 సిక్సర్లు, 8 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసి ఐ యామ్ బ్యాక్ అని బ్యాట్‌తో జవాబు చెప్పాడు. కెరీర్లో 81వ సెంచరీ పూర్తి చేశాడు విరాట్. భారత్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు.

Also Read: ఓపికతో దూకుడు… పెర్త్ లో భారత్ కు విజయావకాశాలు

మూడో రోజు చివరి సెషన్ లాస్ట్ ఓవర్లలో 534 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్‌లోనే కెప్టెన్ బూమ్రా దెబ్బ తీశాడు. 4వ బాల్‌కో మెక్‌స్వెన్సీ అవుటయ్యాడు. 4వ ఓవర్ ఫస్ట్ బాల్‌కు 2 పరుగులు చేసిన కమిన్స్‌ను సిరాజ్ అవుట్ చేయగా… 5వ ఓవర్ రెండో బాల్‌కే మార్నస్‌ను బూమ్రా పెవిలియన్ పంపాడు. దీంతో కేవలం 12 పరుగులకే కంగారు జట్టు 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. అయితే ఆట ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే మాత్రం… ఫలితం ఏదైనా కావొచ్చు. భారత్ బౌలర్లు బంతిని తిప్పేస్తే మాత్రం… నాలుగో రోజు లంచ్ విరామం లోపే పెర్త్ టెస్టు ఫలితం తేలిపోతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్