ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ శుభారంభం దిశగా అడుగులు వేస్తోంది. తొలి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 150 పరుగులకే ఆల్ అవుట్ అయినా… బౌలింగ్ లో మాత్రం దుమ్ము రేపింది. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల లీడ్ సాధించింది భారత్. కెప్టెన్ బూమ్రా 5 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. యువ బౌలర్ హర్షిత్ రానా… మూడు వికెట్లతో రాణించడం, సిరాజ్ రెండు కీలక వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా ఏ దశలో కూడా కోలుకోలేదు.
Also Read : ప్రేమ పెళ్ళిళ్ళకి సిద్దమైన టాలీవుడ్ టాప్ యాక్టర్స్ వీళ్ళే
అలెక్స్ క్యారీ, నాథన్ లియాన్, హెజిల్ వుడ్, స్త్రార్క్ ఇలా భారత బౌలింగ్ కు పరీక్ష పెట్టినా… పరుగులు మాత్రం చేయలేకపోయారు. స్టార్క్ ఒక్కడే దాదాపుగా 110 బంతులు ఆడాడు. లేదంటే ఆస్ట్రేలియా ఎప్పుడో చాప చుట్టేసేది. ఇక ఇక్కడి నుంచే భారత్ జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయకుండా మంచి టార్గెట్ ఇచ్చేలా భారత్ ఆడగలిగితే మాత్రం విజయం దక్కినట్టే. నాలుగో ఇన్నింగ్స్ లో బంతిని అంచనా వేయడం కష్టం. ఇప్పటికే పిచ్ పై ఎండ కారణంగా పగుళ్ళు రావడం మొదలయింది.
Also Read : కంగారులను కంగారు పెట్టేసారు… చుక్కలు చూపించిన పేస్ త్రయం
ప్రస్తుతం భారత్ దాదాపు 100 పరుగుల పైగా లీడ్ లో ఉంది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, జైస్వాల్ శుభారంభం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరు కాస్త కుదురుకుని పరుగులు చేయగలిగితే… మిడిల్ ఆర్డర్ నుంచి సహకారం లభిస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ గెలవడం పెద్ద విషయం కాదు. యువ ఆటగాళ్ళు కూడా కాస్త బ్యాట్ కు పని చెప్తే మాత్రం ఆస్ట్రేలియా ముందు మంచి స్కోర్ టార్గెట్ గా ఉంచవచ్చు. ఇదే సమయంలో డిఫెన్స్ కే ప్రాధాన్యత ఇవ్వకుండా దూకుడుగా కూడా బ్యాటింగ్ చేస్తూ ఉంటే గెలుపు సులువు. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా అడుగూ, చెడ్డ బంతులని బౌండరీకి తరలిస్తూ బ్యాటింగ్ చేస్తున్నారు ఓపెనర్లు. ఇదే పంధా కొనసాగిస్తే మాత్రం భారత్ కి మ్యాచ్ గెలవడానికి అద్భుత అవకాశం ఉంటుంది.