భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్ము రేపాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి సెంచరీ నమోదు చేసాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయినా రెండో ఇన్నింగ్స్ లో పట్టుదలగా బ్యాటింగ్ చేస్తూ… ఆస్ట్రేలియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్… పదే పదే బౌలర్లను మార్చి బౌలింగ్ చేస్తున్నా జైస్వాల్ మాత్రం క్రీజ్ లో పాతుకుపోయాడు. కమ్మిన్స్, స్టార్క్, హెజిల్వుడ్ ఇలా ఎవరు బౌలింగ్ చేసినా సరే దీటుగా నిలబడ్డాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ తో కలిసి 201 పరుగుల తోలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆస్ట్రేలియా పై తొలి వికెట్ కి ఇదే అత్యధిక భాగస్వామ్యం.
Also Read : డ్రోన్ ఎగిరితే చాలు… పోలీసులే షాక్ అవుతున్నారు…!
జైస్వాల్ ఇన్నింగ్స్ ను ఒకసారి పరిశీలిస్తే… బ్యాక్ ఫుట్ పై అతను ఆడిన డిఫెన్స్ కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆస్ట్రేలియా మీడియా ముందుగా హెచ్చరించినట్టు గానే… ఆ జట్టుకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ డకౌట్ కావడంతో… అతన్ని తక్కువ అంచనా వేసింది ఆస్ట్రేలియా టీం. కానీ రెండో ఇన్నింగ్స్ లో సాలిడ్ డిఫెన్స్ తో ఆస్ట్రేలియాకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా స్టార్క్ బౌలింగ్ లో జైస్వాల్ ఆడిన డిఫెన్స్ చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఏ మాత్రం బ్యాటింగ్ కు అనుకూలంగా లేని పిచ్ పై ధైర్యంగా బ్యాటింగ్ చేసాడు.
Also Read : విజయ్ పాల్ అరెస్ట్ కి లైన్ క్లియర్
స్టార్క్ పై మాటల యుద్దానికి కూడా దిగాడు. చాలా స్లోగా బౌలింగ్ చేస్తున్నావ్ అంటూ స్టార్క్ ను జైస్వాల్ కామెంట్ చేయడం హైలెట్ గా నిలిచింది. సాధారణంగా జైస్వాల్ ఆటలో దూకుడు ఉంటుంది. కానీ ఈ ఇన్నింగ్స్ లో మాత్రం ఆ దూకుడు కనపడలేదు. చాలా జాగ్రత్తగా… గోడ కట్టినట్టు ఇన్నింగ్స్ ను నిర్మించాడు జైస్వాల్. చెత్త బంతులను ఏమాత్రం క్షమించకుండా బౌండరీకి తరలిస్తూ… కొన్ని రిస్కీ షాట్స్ ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లకు సహనాన్ని పరీక్షించాడు. తొలి టెస్ట్ తో… తాను ఎంత డేంజర్ రాబోయే టెస్ట్ లకు అనేది ఆస్ట్రేలియాకు బలమైన సిగ్నల్స్ పంపించాడు జైస్వాల్. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచింది అంటే… కెఎల్ రాహుల్, జైస్వాల్ డిఫెన్స్ పుణ్యమే అంటున్నారు ఫ్యాన్స్.