Tuesday, October 28, 2025 01:37 AM
Tuesday, October 28, 2025 01:37 AM
roots

అశ్విన్ వద్దు, అతనే ముద్దు అంటున్న సీనియర్లు

మరో రెండు రోజుల్లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ జరగనున్న నేపథ్యంలో భారత తుది జట్టు లో ఏ మార్పులు చేస్తుంది అనే దానిపై స్పష్టత రావటం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడటం దాదాపుగా ఖరారు గానే కనబడుతోంది, ఇక కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తుండగా… ఇప్పుడు జట్టులోకి మరో ఆల్ రౌండర్ ను తీసుకోవాలి అనే అభిప్రాయాన్ని కోచ్ గంభీర్ వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. ఆస్ట్రేలియా మైదానాలపై ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఈ కాంబినేషన్ చాలా ఉపయోగపడుతుంది.

Also Read : పాపం… ఆ నెంబర్ కలిసి రావడం లేదు…!

మిడిల్ ఆర్డర్లో పంత్ కీలకంగా అన్నాడు ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ ను కూడా తుది జట్టులోకి తీసుకుంటే అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అలాగే రైట్ ఆర్మ్ స్పిన్ తో ఆస్ట్రేలియా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా మైదానాలపై వాషింగ్టన్ సుందర్ కు మంచి అనుభవమే ఉంది. 2021 సీరిస్ లో మంచి ప్రదర్శన చేశాడు. ఇప్పుడు మళ్ళీ అతన్ని తుది జట్టులోకి తీసుకుని అశ్విన్ ను పక్కన పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. అశ్విన్ రెండో టెస్టులో అంత గొప్పగా రాణించలేదు. అయితే కొన్ని కీలక పరుగులు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడింది.

Also Read : మంచు రచ్చకు ఎండ్ కార్డ్… షూటింగ్ కు మనోజ్

అయితే ఇప్పుడు జట్టులో యువకుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని గంభీర్ వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు హర్షిత్ రానాను పక్కన పెట్టేసి ప్రసిద్ కృష్ణను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీనిని భారత సీనియర్ ఆటగాడు చట్టేశ్వర్ పూజార ఖండిస్తున్నాడు. తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవాలని హర్షిత్ రానా ను పక్కన పెట్టవద్దని రానా మొదటి టెస్ట్ లో బాగా బౌలింగ్ చేశాడని రెండో టెస్టులో బౌలింగ్ చేయనంత మాత్రాన అతన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నాడు. అతని వద్ద మంచి పేస్ ఉందని కాబట్టి దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉందని పూజారా అభిప్రాయపడ్డాడు

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్