Tuesday, October 28, 2025 01:15 AM
Tuesday, October 28, 2025 01:15 AM
roots

పాకిస్తాన్ ను ఇరికించిన బీసిసిఐ

అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే డిమాండ్ గురించి అందరికి క్లారిటీ ఉంది. ఈ మ్యాచ్ ను చూడటానికి కేవలం ఈ రెండు దేశాల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూనే ఉంటారు. బ్లూ ఆర్మీ వర్సెస్ గ్రీన్ ఆర్మీగా వాతావరణం ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ రెండు జట్లు తలపడటం ప్రశ్నార్ధకంగా మారింది. మెగా టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లకు మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి. ద్వైపాక్షిక సీరీస్ లు జరిగి దాదాపు 15 ఏళ్ళు దాటింది.

Also Read : కొత్త పెన్షన్ల అర్హతలు… కావాల్సిన పత్రాలు ఇవే

భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతాయో కూడా క్లారిటీ లేదు అనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత్, పాకిస్తాన్ పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి. అసలు పాకిస్తాన్ లో అడుగు పెట్టడానికి భారత జట్టు ఆసక్తి చూపించడం లేదు. దీనితో హైబ్రీడ్ మోడల్ లో మ్యాచ్ లను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భావించింది. హైబ్రీడ్ మోడల్ కు పాకిస్తాన్ అంగీకరించడం లేదు. ఇక భారత్ కు ఈ విషయంలో ముందు సానుకూలంగా ఉన్నా ఇప్పుడు ముందుకు రావడం లేదు.

Also Read : ఏపీ అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా రెడ్డెమ్మ

ఈ టైం లో ఐసీసి పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. భారత్ ను పక్కన పెట్టి టోర్నీ నిర్వహించాలని… తమ దేశంలోనే ఇది జరగాలని కోరింది. దానికి ఐసిసి క్లారిటీ ఇచ్చింది. అసలు భారత్ లేకుండా మ్యాచ్ లు జరిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. భారత్ కారణంగానే ఐసీసికి ఆదాయం భారీగా వస్తోంది. భారత్ కారణంగానే ఇతర జట్ల మ్యాచ్ లకు వ్యూవర్ షిప్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కోసం భారత్ ను పక్కన పెడితే పూర్తిగా ఐసిసి నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే భారత్ లేకుండా టోర్నీ కష్టం అని తేల్చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్