2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి నెలకొంది. అసలు ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లడం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు స్పష్టం చేయడంతో… ఏం చేయాలనే దానిపై ఇప్పుడు ఐసీసీ ఆలోచనలో పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఉంది. భారత్ తో సహా కొన్ని మ్యాచ్ లను దుబాయ్ లో ‘హైబ్రిడ్ మోడల్’ లో నిర్వహించాలని పాకిస్తాన్ సూచించింది.
Also Read : మట్కా వర్సెస్ కంగువ.. నెగటివ్ పబ్లిసిటీ దెబ్బ ఎవరికి?
ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌కు రావడానికి భారత్ అంగీకరించకపోవడానికి గల కారణాలపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరుతూ ఐసీసీకి లేఖ రాసింది పాక్ క్రికెట్ బోర్డ్. దౌత్యపరమైన సమస్యల కారణంగా భారత్ చాలా కాలంగా పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు బీసీసిఐ అభ్యంతరం చెప్పలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 12 ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ఆందోళనలు లేవనెత్తలేదని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
Also Read : జాతీయ జట్టులో దుమ్మురేపుతున్న గుంటూరు కుర్రోడు
హైబ్రీడ్ మోడల్ ను భారత్ అంగీకరించకుండా వైదోగిలిగితే మాత్రం అది భారీ నష్టమే. బ్రాడ్ కాస్ట్ చానల్స్ కు ఐసీసి భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీనితో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ తో పాటుగా మరికొన్ని మ్యాచ్ లను భారత్ లోనే నిర్వహించాలని లేదంటే టోర్నీ మొత్తం భారత్ లోనే నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి పాకిస్తాన్ ఎంత వరకు అంగీకరిస్తుంది అనేది చూడాలి. హైబ్రీడ్ మోడల్ కు భారత్… పూర్తిగా సమ్మతం తెలపకపోవడంతో ఐసిసి రాజీ మార్గాలను అన్వేషిస్తోంది.