Saturday, September 13, 2025 09:28 AM
Saturday, September 13, 2025 09:28 AM
roots

హైదరాబాద్ బిర్యానీకి ఏమైంది..?

హైదరాబాద్ అంటే చాలు అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ…. ధమ్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఎవరైనా సరే హైదరాబాద్ వచ్చారంటే… తప్పకుండా బిర్యానీ తినాల్సిందే. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్లు హైదరాబాద్ నగరానికి బిర్యానీ ఓ బ్రాండ్. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు మసకబారేలా చేస్తున్నారు కొందరు. హైదరాబాద్ బిర్యానీ… ఆహా అనే స్థాయి నుంచి… వామ్మో అనే స్థితికి పడిపోయింది కొందరి వల్ల. ఇది కేవలం కొందరి అత్యాశే కారణం.

Also Read : తెలంగాణాలో టీడీపీ జోష్

ఇటీవల వరుసగా జరుగుతున్న కొన్ని విషయాలు బిర్యానీ లవర్స్ ను భయపెడుతున్నాయి. బిర్యానీ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది బావర్చీ. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. సరదాగా ఫ్రెండ్స్ కలిస్తే చాలు.. ‘ఛలో బిర్యానీ ఖాతే’ అనేస్తారు. అయితే బావర్చీలో ఇటీవల పరిణామాలు బెంబేలెత్తిస్తున్నాయి. బిర్యానీ లో సిగరెట్ పీక రావడంతో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది బావర్చీకి మాత్రమే పరిమితం కాలేదు. అంతకు ముందు భువనగిరిలో జర్రిపోతు వచ్చింది. అల్వాల్ లో బొద్దింక, నాగోల్ లో బల్లి… ఇలా ఒకటి రెండు చోట్ల కాదు… ప్రతి రోజూ ఏదో ఒక దగ్గర ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి.

Also Read : వర్మను దాచిన హీరో ఎవరు…?

జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కుళ్లిన మాంసం, నిల్వ ఉంచిన చికెన్, కాలం చెల్లిన పదార్ధాలు లభ్యమవుతున్నాయి. హైదరాబాద్ బిర్యానీ పరువును కొన్ని హోటళ్లు బజారున వేస్తున్నాయి. హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితేనే నోరూరిన ప్రజలకు.. ఇప్పుడు హోటళ్లలో బిర్యానీని తలుచుకుంటేనే వాంతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వరుస ఘటనలతో బిర్యానీ తినాలంటేనే జనం భయపడుతున్నారు. ఫేమస్ బిర్యానీ సెంటర్లలో సేల్స్ తగ్గుతున్నాయి. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీల్లో బిర్యానీలకు డిమాండ్ పడిపోయింది. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని బిర్యానీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ బిర్యానీని కాపాడాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్