Monday, October 27, 2025 09:34 PM
Monday, October 27, 2025 09:34 PM
roots

లక్షల టన్నుల బంగారం.. ఇండియాలో భారీగా నిక్షేపాలు

భారత్ లో గనుల నిక్షేపాల కోసం పెద్ద ఎత్తున పరిక్షలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్ లో బంగారు నిక్షేపాలను పెద్ద ఎత్తున గుర్తించారు. జబల్పూర్ జిల్లాలోని సిహోరా తెహసిల్‌లోని మహాగవాన్ కోలారి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. జీఎస్ఐ దాదాపు 100 హెక్టార్లలో బంగారు నిల్వలను గుర్తించింది. మట్టి నమూనా మరియు రసాయన విశ్లేషణ సహాయంతో రాగి, ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయి.

Also Read : అమిత్ షా, జేపీ నడ్డా ఫోన్ లు కూడా..?

ఇవి బంగారం, రాగి మరియు ఇతర విలువైన ఖనిజాల జాడలను కూడా గుర్తించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, బంగారు నిక్షేపాలు లక్షల టన్నుల వరకు ఉండవచ్చుని జాతీయ మీడియా వెల్లడించింది. దేశంలోనే అత్యంత ఖనిజ సంపన్న జిల్లాలలో ఒకటిగా నిలిచింది జబల్పూర్. వాస్తవానికి మధ్యప్రదేశ్ ఖనిజ సంపన్న రాష్ట్రం. జబల్పూర్ జిల్లాలో ఇప్పటికే ఇనుము, మాంగనీస్, లాటరైట్, సున్నపురాయి, సిలిసియా ఇసుకను వెలికితీసే 42 గనులు ఉన్నాయి. ఇక్కడి ఇనుప ఖనిజంలో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు.

Also Read : ఏపీ అడ్వకేట్ జనరల్ కు వైసీపీ లంచం.. లాయర్ సంచలన కామెంట్స్

అంతేకాకుండా, పొరుగున ఉన్న కాట్ని జిల్లాలో గతంలో బంగారం ఆనవాళ్లు గుర్తించారు. కానీ ఖచ్చితమైన ఆధారాలు లేవు. ప్రస్తుతం జబల్పూర్ జిల్లాలో గుర్తించిన ఖనిజ నిక్షేపాలపై మరిన్ని పరిక్షలు నిర్వహిస్తోంది జీఎస్ఐ. జిల్లాలో మరిన్ని ప్రాంతాల్లో నిక్షేపాలు ఉన్నట్టు భావిస్తున్నారు. వీటిపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చిన తర్వాత తవ్వకాలు మొదలుపెట్టే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి పరీక్షలను పూర్తి చేస్తారని వెల్లడించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్