పంచదారతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనే మాట వాస్తవం. అందుకే షుగర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. మన దేశంలో ఏటా గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్ కు షుగర్ కారణంగా మారుతున్న మాట వాస్తవం. అందుకే వైద్య నిపుణులు తాజాగా కీలక హెచ్చరికలు చేసారు. పుట్టిన పిల్లలకు వెయ్యి రోజుల లోపు షుగర్ పెట్టకుండా ఉండటం మంచిదని, అలా చేస్తే వారికి భవిష్యత్తులో వచ్చే గుండె జబ్బులను కట్టడి చేయవచ్చని తెలిపారు.
Also Read : నా భర్తను పరిచయం చేస్తున్నా: రష్మిక
ది బీఎంజేలో ప్రచురితమైన ఇటీవలి కథనంలో సంచలన విషయాలను ప్రస్తావించారు. బాల్యంలో తక్కువ చక్కెర తినేవారికి పెరిగి పెద్దయ్యాక, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని వెల్లడించారు. హృదయ సంబంధ వ్యాధులు, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, గుండె వైఫల్యం, స్ట్రోక్ కారణంగా మరణాలు వంటివి ఉన్నాయి. 1953లో యునైటెడ్ కింగ్డమ్ లో రేషన్ లో షుగర్ ను తొలగించిన నాటి నుంచి ఈ డేటా తీసుకున్నారు. యూకేలో చక్కెర రేషన్ ను 1953 సెప్టెంబర్ లో నిలిపివేశారు.
అందుకే జీవితం ప్రారంభ రోజుల్లో చక్కెరను పరిమితం చేయడంతో.. భవిష్యత్తులో గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశంపై పరిశోధనకు అవకాశం దొరికింది. రేషన్ కాలంలో, గర్భిణీ స్త్రీలు, పిల్లలు సహా మొత్తం జనాభాకు చక్కెరను రోజుకు 40 గ్రాముల కంటే తక్కువకు పరిమితం చేశారు. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులకు అదనంగా చక్కర ఇవ్వడాన్ని నిషేధించారు. ఈ అధ్యయనంలో యూకే బయోబ్యాంక్ నుండి 63,433 మంది పాల్గొన్నారు. వీరి సగటు వయస్సు 55 సంవత్సరాలు.
Also Read : టార్గెట్ జనసేనాని అంటున్న బొలిశెట్టి..!
ఇందులో పాల్గొనేవారు అక్టోబర్ 1951, మార్చి 1956 మధ్య జన్మించారు. వీరికి గుండె జబ్బుల చరిత్ర లేదు . 40,063 మంది జీవితంలో ప్రారంభంలోనే షుగర్ తీసుకున్నారని, 23,370 మంది షుగర్ తీసుకోలేదని గుర్తించారు. సుమారు 2 సంవత్సరాల వయస్సు వరకు చక్కెర తినడం పరిమితం చేసిన వారిలో గుండె జబ్బులు రావడంలో ఆలస్యం కావడం గుర్తించారు. జీవితంలోని మొదటి 1000 రోజులు.. గర్భధారణ నుండి దాదాపు 2 సంవత్సరాల వయస్సు వరకు పోషకాహార పరంగా దీర్ఘకాలిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు అంటున్నారు. చక్కెర తిన్నవారిలో కొంత ప్రమాదకరంగా ఆరోగ్యం ఉందని, యుక్తవయస్సులో హృదయ సంబంధ ప్రమాదాలు తలెత్తాయని గుర్తించారు.

