Friday, September 12, 2025 05:23 PM
Friday, September 12, 2025 05:23 PM
roots

జగన్ పై అనిత సంచలన కామెంట్స్.. వాట్సాప్ మెసేజ్ లపై కీలక వ్యాఖ్యలు 

వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనపై వివాదం రేగుతున్న నేపధ్యంలో.. హోం మంత్రి అనిత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. నిన్నటి జగన్ టూర్ ఓ డ్రామాని తలపించిందని.. ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అని మండిపడ్డారు. వైకాపా హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు పని చేయాలని చెప్తున్నట్టు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు అనిత.

Also Read : మొత్తం మీరే చేశారు.. ఇవిగో సాక్ష్యాలు..!

12.42 కి రోడ్డు మార్గం కన్ఫర్మ్ అయ్యిందని.. కొద్ది నిమిషాల్లో చాపర్ బయలుదేరిపోయిందన్నారు. ఇదంతా క్రిమినల్ లీడర్ ఫ్రీ ప్లాన్ అన్నారు. ఇలా కూడా ఆలోచన చేస్తారా అనిపించింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. జగన్ మాట్లాడుతుంటే వైసీపీ 5 ఏళ్ల జగన్ అరాచక పాలన గుర్తుకొచ్చిందన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదని.. ముసుగులేసుకుని కస్టోడీయల్ టార్చర్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా అంటూ నిలదీశారు.

Also Read : అమరావతిలో కొత్త పోలీస్ స్టేషన్.. ఎందుకంటే..!

ఇలాంటి సంస్కృతి మాది కాదన్నారు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రిపై అనేక కేసులు ఉన్నాయని ఇవన్నీ ప్రశ్నించడంతో పెట్టారు అన్నారు. సిఎంఆర్ నుంచి కొని తెచ్చుకోవడంతో వచ్చింది కాదు ఖాకీ చొక్కా అంటూ మండిపడ్డారు. అటువంటి ఖాకీ చొక్క ఊడదీస్తానని ఎక్స్ సీఎం అనొచ్చా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు 2800 పై చిలుకు హత్యలు జరిగాయన్నారు. ఇలా ప్రవర్తిస్తే 151 నుంచి 11 కి దిగిపోయావు అంటూ ఎద్దేవా చ్చేసారు.

Also Read : రోహిత్ ను వెంటాడుతున్న “బౌల్డ్” భయం

నువ్వు మారకపోతే అవి కూడా రావన్నారు. వైసీపీ వాళ్ళ తీరు మారకపోతే చట్టం తనపని తను చేసుకుపోతుందన్నారు. జగన్ ని వదిలి చాపర్ వెళ్లిపోవడంపైనా సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. పెందుర్తి ట్రాఫిక్ అంశంపైనా పోలీసులు తప్పులేదన్నారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. 1100 మంది పోలీసులను పెట్టామన్నారు. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతమని.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పెట్టామన్నారు. వాట్సాప్ లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారని మండిపడ్డారు. కావాలని ఓ సీన్ క్రియేట్ చేయాలని చూసారన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్