Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

ఉగ్రవాదుల సరికొత్త ప్లాన్.. కాశ్మీర్ లో హై అలెర్ట్

జమ్మూ కాశ్మీర్‌ లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనితో పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేసారు. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి ప్రముఖ జైళ్ళపై దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నారు. ఈ జైళ్లలో ప్రస్తుతం పలువురు హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. వీరు దాడులలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, లాజిస్టికల్ సహాయం, ఆశ్రయం, ఉగ్రవాదులకు సమాచారం ఇవ్వడం వంటివి చేసారు.

Also Read : నేను, పవన్, మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ వేగవంతం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇటీవల ఉగ్రవాదులు, నిసార్, ముష్తాక్‌లను ప్రశ్నించింది, వీరికి ఆర్మీ వాహనంపై దాడి కేసుతో సంబంధం ఉంది. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగానే నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇక నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో, జైళ్లలో భద్రతా ఏర్పాటును ఉన్నతాధికారులు సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు భద్రతను కట్టుదిట్టం చేసారు.

Also Read : ఇండియన్ సినిమాకు ట్రంప్ దెబ్బ.. మరో సంచలన నిర్ణయం

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, డైరెక్టర్ జనరల్ ఆదివారం శ్రీనగర్‌లోని భద్రతను పర్యవేక్షించే ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కాగా 2023 అక్టోబర్‌లో జమ్మూ, కాశ్మీర్ జైళ్ల భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.. సిఆర్పీఎఫ్ తీసుకుంది. ఇదిలా ఉంచితే.. పహల్గామ్ దాడి జరిగిన వారం రోజుల తర్వాత కూడా, ఉగ్రవాదులు ఇప్పటికీ దక్షిణ కాశ్మీర్‌లో దాక్కుని ఉండవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ అంచనా వేస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉగ్రవాదులు దాక్కుని ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్