Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

మహిళలకు గుండెపోటు ఛాన్స్ ఏ టైం లో అంటే…?

సాధారణంగా మహిళలకు గుండెపోటు అనేది కరోనాకు ముందు పెద్దగా మనం వినలేదు. కానీ కరోనా తర్వాత మహిళలకు కూడా గుండెపోటు రావడం అనేది సాధారణ విషయంగా మారిపోయింది. చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వైద్యులు మహిళలకు గుండెపోటు ఏ సమయంలో వస్తుందో హెచ్చరిస్తున్నారు. అలాగే మహిళలకు గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలను కూడా తాజాగా వైద్యులు బయటపెట్టారు.

Also Read : ప్రియాంక మూడేళ్ళు బలి.. రాజమౌళి ప్లానింగ్ అదే

అధిక రక్తపోటుతో పాటుగా షుగర్ అలాగే మోనోపాజ్, ఒత్తిడి మొదలైనవి మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించారు. హార్మోన్ల మార్పులు.. ముఖ్యంగా తెల్లవారుజామున మహిళల్లో గుండెపోటుకు దారితీస్తుందని హెచ్చరించారు. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో మహిళలకు ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడించాయి. మహిళలు చురుకుగా ఉండటం చాలా మంచిదని, అలాగే వారంలో ఎక్కువసార్లు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Also Read : ఓట్ల కోసం ఆల్‌ ఫ్రీ.. భారం ఎవరిపైనా..?

ఎక్కువ ఒత్తిడి కూడా గుండె సమస్యలను ప్రేరేపిస్తుందని హెచ్చరించారు. ప్రాణయామం అలాగే ధ్యానం, వాకింగ్ వంటివి గుండెపోటు సమస్యలను తగ్గించే అవకాశం ఉందని, పండ్లు కూరగాయలు తృణధాన్యాలుతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని సూచించారు. ఉప్పు చక్కెర మరియు కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు మహిళల దూరంగా ఉండటం ఉత్తమం అని తేల్చారు. కొంతమంది స్త్రీలకు తెల్లవారుజామున వికారం లేదంటే వాంతులు అలాగే తేలికపాటి తలనొప్పి ఉంటే జాగ్రత్త పడాలని, ఈ లక్షణాలు కొన్ని సార్లు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఉండవచ్చని కానీ అది గుండె సమస్యల గురించి ఒక వార్నింగ్ లాంటిదని వైద్యులు తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్