Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

వాయు కాలుష్యంతో గుండెపోటు.. శాస్త్రవేత్తల వార్నింగ్

ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలతో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. భారత్, చైనా, అమెరికా వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో మరింత తీవ్రంగా ఉంది. చలి కాలం వచ్చిందంటే దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా పలు ప్రముఖ నగరాల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. తాజాగా వాయు కాలుష్యం ఎంత ప్రమాదకరమో.. వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో పాటుగా గుండెపోటుకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : సినిమాల్లోకి మరో మాజీ స్టార్ క్రికెటర్

వాయు కాలుష్యం ప్రాణాంతక గుండెపోటులు, స్ట్రోక్‌లకు కారణమవుతుందని చాన్నాళ్ళుగా వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు ఊపిరితిత్తులలోకి పీల్చే కణాలు గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఖచ్చితంగా తెలియదు. బ్రిటిష్ పరిశోధకులు దీనిపై సంచలన విషయాలు వెల్లడించారు. మనం పీల్చే నానోపార్టికల్స్, ముఖ్యంగా వాహనాల నుండి వచ్చేవి, ఊపిరితిత్తుల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి, కాలక్రమేణా నాళాలలో పేరుకుపోతాయని గుర్తించారు. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Also Read : మరాఠా గడ్డపై థాక్రేల హగ్ సెన్సేషన్

ఏసీఎస్ నానో జర్నల్ లో దీనిపై ఇటీవల ఓ కథనం వెల్లడించారు. మనం పీల్చే కణాలు మన రక్తంలోకి ప్రవేశిస్తాయని, ధమనులు, రక్త నాళాలు, గుండెతో సహా శరీరంలోని వివిధ భాగాలకు అవి వెళ్ళే అవకాశం ఉందని.. ఈ నానోపార్టికల్స్ అప్పటికే కరోనరీ హార్ట్ డిసీజ్‌తో బాధపడుతున్న వ్యక్తుల దెబ్బతిన్న రక్త నాళాలలో పేరుకుపోయి పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పరిశోధకులు తెలిపారు.

Also Read : అదరగొట్టిన హైదరాబాద్ నవాబ్.. న్యూ బాల్ కింగ్

వాయు కాలుష్యం ఒక కిల్లర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ఛారిటీలో ప్రొఫెసర్ అసోసియేట్ మెడికల్ డైరెక్టర్ జెరెమీ పియర్సన్ హెచ్చరించారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 6 లక్షలకు పైగా ప్రజలు బహిరంగ వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. సాధారణ గాలిని పీల్చడంతో పోలిస్తే, కలుషితమైన గాలిని పీల్చడం వల్ల రక్తపోటు 2-3 పాయింట్లు పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు మూత్రపిండ వైఫల్యం వంటి వివిధ సమస్యలతో ఇది ముడిపడి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్