Friday, September 12, 2025 11:21 PM
Friday, September 12, 2025 11:21 PM
roots

ఏపిలో మందుబాబులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయింది. గత అయిదేళ్లుగా భారీ మద్యం ధరలతో మందు బాబులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయంపై ఫోకస్ చేసింది సిఎం చంద్రబాబు… మద్యం ధరలను భారీగా తగ్గించేందుకు సిద్దమయ్యారు. మద్యపాన నిషేధం పేరుతో జగన్ భారీగా మద్యం ధరలను పెంచగా… ఇప్పుడు తగ్గిస్తూ వస్తున్నారు. గతంలో మాదిరిగానే లిక్కర్ పాలసీని మార్చిన రాష్ట్ర ప్రభుత్వం… ఇప్పుడు ధరల తగ్గింపుపై ఫోకస్ చేసింది.

Also Read : జనసేన… రాజకీయ పునరావాస కేంద్రం…!

బీర్లు, విస్కీ, బ్రాందీ ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. దీనితో ఒక్కో బ్రాండ్ ధరను వరుసగా తగ్గిస్తూ వస్తున్నారు. మందుబాబులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పడానికి ఎక్సైజ్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ ₹99కే అందిస్తున్న ప్రభుత్వం…. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర ₹230 నుంచి ₹210కి తగ్గించింది. ఫుల్ బాటిల్ ₹920 నుంచి ₹840కి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : బియ్యం మాఫియా పై పవన్ ఫైర్.. కాకినాడ పోర్టులో పవన్ తుఫాన్

మాన్షన్ హౌస్ క్వార్టర్ ₹220 నుంచి ₹190కి తగ్గించారు. ఇప్పటి వరకు ఫుల్ బాటిల్ ₹870 ఉండగా… అక్కడి నుంచి రూ.760కి తగ్గించింది. యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ₹1,600 నుంచి ₹1,400కు తగ్గించి అమ్ముతోంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక బీర్ల ధరలను వేసవిలో భారీగా తగ్గించే అవకాశం ఉంది. కింగ్ ఫిషర్ ఆల్ట్రా ధర ప్రస్తుతం 220 గా ఉండగా 180 కి తీసుకు రానున్నారు. అదే బ్రాండ్ లో లైట్, స్ట్రాంగ్ బీర్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. కార్ల్స్ బర్గ్ బీర్ ప్రస్తుతం 290గా ఉండగా త్వరలోనే తగ్గించనున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్