Sunday, October 19, 2025 11:07 PM
Sunday, October 19, 2025 11:07 PM
roots

రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు.. జీవితమే మారిపోతుందా..?

మన ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో మందుల కంటే సహజంగా దొరికే ఎన్నో ఆహార పదార్ధాలు సహాయ పడుతూ ఉంటాయి. అల్లం, వెల్లుల్లి, ఉల్లి, లవంగాలు ఇలా మన వంట గదిలో ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. అందులో వెల్లుల్లి మనకు ఎంతో మేలు చేస్తోంది అంటున్నారు నిపుణులు. ఉదయం పచ్చి వెల్లుల్లిని తింటే ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుందట. దానికి కారణం పచ్చి వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన అల్లిసిన్ అనే సమ్మేళనం ఉండటమే.

Also Read : జీఎస్టీ తగ్గుతోంది.. మిడిల్ క్లాస్ కు పండుగే.. తగ్గే ధరలు ఇవే..!

గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా మంచిది. 2013 పరిశోధన ప్రకారం వెల్లుల్లి అధిక రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ రెండూ గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త నాళాలను సడలిస్తుంది. అలాగే జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. 2019 పరిశోధన ప్రకారం, పచ్చి వెల్లుల్లితో మీ రోజును ప్రారంభిస్తే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మీ పొట్టలో ఆహారాన్ని సమర్ధవంతంగా ప్రాసెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

Also Read : ఐఫోన్ 17.. మేడిన్ ఇండియా.. బెంగళూరులో మొదలైన ప్రొడక్షన్..!

వెల్లుల్లిలో ప్రీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయని నిపుణుల పరిశోధనలో వెల్లడి అయింది. ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతీ రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు గనుక తింటే చర్మం కూడా బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు. అలాగే బరువు తగ్గడంలో కూడా వెల్లుల్లి ఎంతగానో సహాయ పడుతుంది. ఆకలిని కంట్రోల్ చేయడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తూ ఉంటుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్