“నేను మారాను… ఇక మారిన చంద్రబాబును చూస్తారు..” అంటూ ఎన్నికల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రతి కార్యకర్తకు గుర్తే. నాటి వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తీవ్ర ఇబ్బందులు పడిన వారే. ఇంకా చెప్పాలంటే.. జై టీడీపీ అనేందుకు కూడా చాలా భయపడిపోయారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలని ఒకటికి పదిసార్లు ఆలోచించారు. వ్యక్తిత్వ హననం, ఆడవారిని కించపరుస్తూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫోటోలు.. ఇలా వైసీపీ అభిమానుల అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. దీనిపై అధినేతకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన చంద్రబాబును చూస్తారంటూ భరోసా ఇచ్చారు.
Also Read: నాగబాబుకు షాక్ తప్పదా..?
చంద్రబాబు అంటే పని రాక్షసుడు అనే పేరు. నిరంతరం పని చేస్తూనే ఉంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇక విజన్‌తో పని చేసే చంద్రబాబుకు దూరదృష్టి ఉంటుంది. ఆ లక్ష్యసాధన కోసమే ప్రతి ఒక్కరిపై ఒత్తిడి తీసుకువస్తారు. ప్రభుత్వ అధికారుల్లో అలసత్వం వదిలించడం, అధికారంలో ఉన్న సమయంలో రాజకీయాల కంటే కూడా ప్రజలకు మేలు, రాష్ట్రాభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం అన్నట్లుగా చంద్రబాబు ఆలోచనా విధానం, పని తీరు ఉంటుంది. అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తల సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోరనే విమర్శలు కూడా చంద్రబాబుపై ఉన్నాయి. పరిపాలనలో ఎలాంటి అవినీతికి తావు లేదనేలా.. చివరికి సొంత పార్టీ నేతలకు కూడా ప్రభుత్వ నియమాలకు తగినట్లుగానే పథకాలు అందేలనేది చంద్రబాబు మాట.
Also Read: కూటమి పార్టీలను విడగొట్టడానికి ఎవరో రానవసరం లేదు..!
దీని వల్ల కొంతమంది పార్టీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక చంద్రబాబు విధానాలను వ్యతిరేకించిన కొందరు నేతలు.. సైలెంట్‌గా పార్టీ మారిపోయారు. రాజకీయాల్లో ఏ పార్టీకి అయినా సరే కార్యకర్తలే ముఖ్యం. వారి సంక్షేమానికే పార్టీలు పెద్ద పీట వేస్తాయి కూడా. వాస్తవానికి అలాంటి విషయంలో టీడీపీ తర్వాతే ఏ పార్టీ అయినా కూడా. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఉచిత బీమా, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యక నిధి, పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల కోసం ప్రత్యేక విభాగాలు.. ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తారు కూడా. నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. తన విధానాల వల్లే టీడీపీ రెండు సార్లు ఓడిపోయిందని స్వయంగా వెల్లడించారు.
Also Read: జనసేన వల్ల టీడీపీకి లాభమా.. నష్టమా..?
ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి వల్లే పార్టీకి కొంత చెడ్డపేరు వచ్చిందన్నారు. ఉద్యోగులకు తాను మంచి చేసినప్పటికీ.. అది చెప్పుకోలేకపోయామన్నారు. ఇకపై అలా జరగదని.. రాజకీయాలు కూడా చేస్తానంటూ భరోసా ఇచ్చారు. కానీ చంద్రబాబు విధానంలో ఎలాంటి మార్పు రాలేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 1995 నాటి అదే పాత వాసన ఇంకా పోలేదంటున్నారు. ఆకస్మిక తనిఖీలంటూ అధికారులను ఇప్పటికీ బెదిరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పార్టీ కార్యకర్తకు ఏ మాత్రం భరోసా ఇవ్వటం లేదంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నాకూడా పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని.. అయినా సరే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటున్నారు.
Also Read: పవన్ టార్గెట్ అదే.. అందుకే తేనె తుట్టును కదిపారా…?
గతంలో వైసీపీ నేతల గురించి ఓ వ్యాఖ్య చేసినా సరే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారని.. కానీ ఇప్పుడు మాత్రం.. టీడీపీ నేతలపైన అటు సోషల్ మీడియాలో, నేరుగా ఎన్ని విమర్శలు చేసినా కూడా.. ఎలాంటి చర్యలు లేవంటున్నారు. కార్యకర్తలను హత్య చేస్తున్నా కూడా.. కఠిన చర్యలు లేవని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా కూడా.. వైసీపీలో కొందరు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ప్రభుత్వంపై చులకన భావన పెరిగిపోతోందంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోకపోతే.. మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు. అయితే వీటన్నిటికి ముందు అధికారులని మార్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ఇవన్ని ఎప్పుడు జరుగుతాయో చూడాలి.




