పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతోంది. ఏళ్ళ తరబడి ఈ సినిమా కోసం పవన్ అభిమానులతో పాటుగా మెగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించి సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను రత్నం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : అమ్మో పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రానికి ట్రంప్ దెబ్బ తప్పదా..??
ఇటీవల వచ్చిన సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఫుల్ బూస్ట్ ఇచ్చాయి. హైదరాబాద్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. శిల్ప కళా వేదికలో జరగనున్న ఈ సినిమా కార్యక్రమానికి పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. నిన్నటి వరకు జరుగుతుందా లేదా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు లైన్ క్లియర్ చేసారు. వెయ్యి నుంచి 1500 మందికి మాత్రమే అనుమతిచ్చిన పోలీసులు.. గత ఘటనలను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేసారు.
Also Read : శ్రీశాంత్ కూతురు అన్న మాటలకు కన్నీళ్లు ఆగలేదు
కార్యక్రమానికి నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండీషన్ పెట్టారు. బయట క్రౌడ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూచనలు చేసారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సరే.. నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. ఇటీవల పదే పదే తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పుష్ప సినిమా ఘటన తర్వాత సినిమా పరిశ్రమపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.