మంచు కుటుంబంలో వివాదాలకు బ్రేక్ పడిందా…? అంటే అవుననే సమాధానం వినబడుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఈ వివాదం తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఆదివారం ఉదయం నుంచి పోలీస్ స్టేషన్, హాస్పిటల్ అలాగే మోహన్ బాబు నివాసం వేదికగా ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో దుమ్మురేగుతుంది. మీడియా కూడా ఈ విషయంలో కాస్త హడావుడి ప్రదర్శించింది. దీనితో మోహన్ బాబు ఆగ్రహం పట్టలేక మీడియా ప్రతినిధులపై దాడులకు కూడా దిగారు. ఇక నిన్న సాయంత్రం మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ పోలీసుల వద్దకు వెళ్లడం పోలీసులు కూడా ఈ విషయంలో కాస్త స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగినట్టు కనపడుతుంది.
Also Read : మంత్రివర్గ విస్తరణ.. ముహుర్తం ఆ రోజేనా..!
ఇక మధ్యవర్తులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో మంచు కుటుంబం కాస్త శాంతించినట్టు కనపడుతోంది. మంచు మనోజ్ ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్ కోసం బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయన భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కీలక దశలో ఉండటంతో వివాదాలకు బ్రేక్ ఇచ్చి మనోజ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. తన వద్ద ఉన్న బౌన్సర్లను కూడా నిన్ను సాయంత్రం మనోజ్ పంపించేశారు. అటు మంచు విష్ణు కూడా తన వద్ద ఉన్న బౌన్సర్లను పంపించేయడంతో వివాదం దాదాపుగా సద్దుమణిగినట్టే కనపడుతుంది.
Also Read : అమరావతి నిర్మాణం అప్పటి వరకు పూర్తి కాదా…?
ప్రస్తుతం మనోజ్ వద్ద వ్యక్తిగత సిబ్బంది మాత్రమే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే షూటింగ్ స్పాట్ కు మనోజ్ భార్య మౌనిక కూడా వెళ్ళినట్టుగా సమాచారం. త్వరలోనే మధ్యవర్తుల సమక్షంలో ఆస్తుల పంపకాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి సినీ వర్గాలు. ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఆస్తులు వ్యవహారానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వివాదాల కేంద్రమైన వినయ్ అనే వ్యక్తిని కూడా మంచు కుటుంబం నుంచి పంపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.




